పూల బాలలోయ్!

అంశం: హాస్యకవిత

పూల బాలలోయ్!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

వాకిట్లో పూల మొక్కలుంటే ఎంతఅందమో..
నాసామిరంగా నవ్వుతూ పలికేపూలబాలలూ !
అలాబజారెళ్లి నాల్గుమట్టి కుండీలుతెచ్చిపెట్టాను
తెల్లారేసరికి పిల్లిముండలు దోసేసిపగలగొట్టేయి!
ప్లాస్టిక్ గోతాల్లో మట్టినింపి వందరూపాయల మొక్కలుతెచ్చినాటేశా!
కనకాంబరాలు ఎండకి కన్నీళ్లు పెట్టాయి.
చేమంతి, బంతి చక్కగా నిలదొక్కుకునే !
సీతమ్మజడకుచ్చులు రాము లోరిని వెతుక్కుంటూ పోయే!
మందారం, మల్లెలు నిర్లిప్తంగా ఉన్నాయి
నీలాంబరం నిలువునా ఎండిపోయే
గులాబీలు ఉందామా వద్దాని గుసగుసలే !
నందివర్ధనం నా కన్నీళ్లు తుడిచి మొగ్గలేసిందోచ్… !
శంఖుపూలతీగ సరదాగా అల్లుకుంది
ఫర్లేదూ.. వచ్చేసింది పూలతోట! మా వాకిట!
మనోహరదృశ్యాలు సీతాకోక తుమ్మెదల తో !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!