విధి వైపరీత్యం

విధి వైపరీత్యం

రచన: శ్రీదేవి విన్నకోట

బాలల బంగారు బాల్యం
అమ్మానాన్నల సాహచర్యంతో
తోబుట్టువుల అనురాగంతో
స్నేహితుల ఆటపాటలతో
ఇష్టమైన చదువు సంధ్యలతో
ఆనందంగా ఉండాల్సిన వారి ఆనందాన్ని హరిస్తూ
చిన్నారులు శ్రమను దోపిడీ చేస్తూకర్మాగారాల్లో కరిగిపోతూ
కర్కాణాల్లో నలిగిపోతూ
కఠినమైన మాటలతో మగ్గిపోతూ,
చిన్నారుల మనసుకు తూట్లు పడుతూ
చిట్టి చిట్టి చేతులు అలసిపోతూ,
జీవితాలను యంత్రాలకి అంకితం చేస్తూ,
మరల మధ్య మర మనుషుల్లా తిరుగుతూ,
అతి భారంగా బరువుల్ని మోస్తూ,
కళ్ళల్లో ప్రాణాలు అడుగంటిపోతూ,
బాల్యం సమాధి అయిపోతూ,
అవుతుంది వారి బ్రతుకు చిద్రం
ఇదే నేటిబాలల బ్రతుకు చిత్రం
కాలాలు మారుతున్నా ఎవరు ఎన్ని కబుర్లుచెబుతున్న,
నేడు మన సమాజంలో మార్చి మాయ చేయలేని విచిత్రం
ఇదే  మన విధి వైపరీత్యం
నిస్సహాయంగా చూస్తూ ఉండటమేగా మనం  చేయగల మహత్తర సాయం.
అదే మన నిర్లక్ష్యానికి తార్కాణం,మనం మారితే బాలల బంగారు బాల్యంవిరుస్తుంది,
చిరునవ్వుల లోకం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!