ప్రేమకు వందనం.

ప్రేమకు వందనం.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : జీ.వి నాయుడు.

సంక్రాతి పండుగకు చుట్టాలు అందరు పల్లెటూరు కు పరుగు తీశారు. అంతా కలిపి ఆ పల్లెటూరులో ఓ నాలుగు వందలు ఇళ్ళు ఉంటాయి. సుమారు ఓ నలభై ఏళ్ల క్రితం ఆ ఊరు అడవిని తలపించేది. అప్పట్లో అన్నీ పూరిపాకలే. వయసు పైబడిన వారు మినహా మిగిలిన వారు ఎవరు ఈ ఊళ్ళో ఉండరు. నీటిపారుదల వసతి లేక పంట పొలాలు అన్నీ బీడుభూములుగానే ఉండేవి. యువకులు విద్యావంతులు కావడం తో అందరు వివిధ ప్రాంతాలల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటా ఆర్ధికంగా బలపడ్డ కుటుంబాలు అధికం. దీంతో ఆ పల్లెటూరు లోని పూరి పాకలు ఇంద్ర భావనాలు అయ్యాయి. వివిధ కారణాలతో వలస వెళ్లిన వారు పండుగ నాడు ( సంక్రాతి )అందరు ఈ పల్లెటూరు కు చేరుకోవడం ఆనవాయితీ. పదేళ్ల క్రితం అమెరికా లో సెటిల్ అయిన రఘు గత ఏడాది సంక్రాతికీ తన స్వగ్రామం అయిన ఆ పల్లెటూరుకు వచ్చాడు. రఘు అమెరికా లోనే చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఎన్నో పెళ్ళి ప్రొపొసల్స్ వచ్చినా రఘు ఎందుకో ఆసక్తి చూపలేదు. కారణం తన మనసులో తనతో పాటు ఆగ్రామంలో డిగ్రీ చేసిన మాధవిని వివాహం చేసుకోవాలి అనే ఆలోచన ఉండడమే. డిగ్రీ చదువుకునే రోజుల్లో మాధవి, రఘు ఒకే బసులో వెళ్ళేవారు. తెలియకుండా ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగిపోయింది. అయితే మనసులో ఉంచుకున్నారే గానీ బయటకు వ్యక్తం చేయలేదు. మాధవి కూడా ఏదో ఓ రోజు రఘుతోనే తనకు మూడుముళ్ళు పడుతాయి అని బలంగా ఊహాలోకంలో తేలిపోయేది.
సంక్రాంతి పండుగ రోజు ఆ పల్లెటూరు లో ఓ ఉత్సవం చేస్తారు. రఘు మొక్కలు తీర్చుకునేందుకు గుడికి వచ్చారు. అదే సమయంలో మాధవి కూడా తన తల్లి, చెల్లి తో పాటు గుడికి వచ్చారు. పల్లెటూరులో అందరు వరసలు కలుపుకొని పలకరించడం అలవాటు. రఘును చూడగానే మాధవి తల్లి శాంతమ్మ ” ఏమిటి అల్లుడు, బాగున్నావా! ఎప్పుడు వచ్చావు, ఏంటి సంగతులు ” అంటు దగ్గరచేరి కుశల ప్రశ్నలు వేసింది. ఈ పలకరింపు రఘును ఎక్కడికో తీసుకవెళ్ళింది. మాధవి కూడా హావ భావాలతో తనలో దాగివున్న ప్రేమను కనిపించకుండా మాటలు కలిపింది. అందరు గుడి బయటకు వచ్చి ముచ్చట్లలో మునిగిపోయారు. ” రా అల్లుడు ఇంటికి వెళ్ళి మంచినీళ్లు తాగి వెల్దువు. మీ మామయ్యా అప్పుడప్పుడు నీ గురించి చెబుతూ ఉంటాడు ” అంటు శాంతమ్మ ఆహ్వానం పలికింది. ” అమ్మయ్య… దేవుడు నిజంగానే కరుణించాడు. మాధవితో మాట్లాడి, తనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసి, వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే అమెరికా నుండి వచ్చాడు రఘు. ఎతక పోయిన తీగ కాలికి తగిలినట్లు అత్తగారు ఆహ్వానంతో తన మనసు ఆనంద డోలికల్లో ఉబ్బి తబ్బిబ్బు అయింది. అందరు శాంతమ్మ ఇంటికి బయలుదేరారు.

“హాల్లో.. మామయ్యా! బాగున్నారా ? నేను రఘు ని, ఏంటీ ఇలా బక్క చిక్కి పోయారు? ఆరోగ్యం ఎలా ఉంది. ” అంటు అనారోగ్యంతో ఉన్న మాధవి తండ్రి భద్రయ్యను పలకరించారు రఘు. “ఏముంది అల్లుడు.. ఈ కరోనా మహమ్మారీ ఏమంటు దిగబడిందో గానీ అన్నీ ఇళ్ళు గుళ్ళయ్యాయి. అసలే నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఏదో ప్రవేటు ఉద్యోగం చేసి ఇళ్ళు గడిపేవారు. కరోనాతో ఆ కంపెనీ మూత వేసి వాళ్ళను ఇంటికి పంపారు. పొలాలు కౌలికి ఇస్తే.. వర్షాలు లేక పంటలు లేవు. ఓ వైపు అనారోగ్యం. ఈ బిడ్డలకి ఎలా పెళ్లిళ్ళు చేసి పంపాలో ఓ దిగులు. బక్క చిక్కక ఏమి చెయ్యాలి రఘు ” అంటు మాధవి తండ్రి సూర్య సమస్యలు ఏకరవు పెట్టారు. దీంతో రఘు మనసు చలించింది. కాఫీ తీసుకొని వచ్చి రఘుకు ఇచ్చింది మాధవి.
” అత్తమ్మను పిలుపు, అందరు కూర్చోండి. మీతో మాట్లాడాలి ” అంటు రఘు వారితో పిచ్చా పాటిగా మాటలు కలిపాడు. ” మామయ్యా.. అత్తమ్మ.. మీకు ఓ విషయం స్పష్టంగా చెబుతున్నా. మామయ్యా చెప్పిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. మీకు ఇక నుంచి ఏ కష్టం నష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీకు ఇష్టం అయితే మాధవి కూడా ఇష్టపడితే నేను తనను పెళ్లి చేసుకుంటాను. నా మరదలు రజనీకీ కూడా మంచి అబ్బాయిని చూస్తాను. అందరు అమెరికాలో ఉండవచ్చు. నాకు మాధవి అంటే చదువు కునే నాటినుంచి ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి. ఇక మీదే ఆలస్యం ” అంటు తన మనసులోని మాటలు పూస గుచ్చినట్లు చెప్పాడు రఘు. దీంతో అందరు ” ఇది కలయా.. నిజామా ” అన్నట్టు ఒక్క సారి ఆనందం పెల్లుబికింది.

” సాక్షాత్తు దేవుడే.. ఈ బంధం కలిపాడు. ” అంటు అందరు వారి సమ్మతి తెలిపారు. మాధవి చెల్లెలు రజనీ కీ కూడా అమెరికా అబ్బాయిని రఘు చూసాడు. మొత్తం పెళ్ళి ఖర్చు అంతా రఘు ముందుగానే అత్త మామలకు అందజేశారు. పది రోజులు గడవక ముందే ఆ ఇంట్లో పెళ్ళి సందడి నెలకొంది. మాధవి రఘు, రజనీ, రోహిత్ల వివాహాలు ఒకే రోజు వైభవంగా జరిగాయి. మాధవి, రజనీలు అదృష్టజాతకులు అంటు చర్చలు సాగాయి. శాంతమ్మ పూజలు ఫలించాయి అంటు మహిళలు చెప్పసాగారు. రఘు, రోహిత్ తో పాటు మాధవి, రజనీ లకు కూడా అమెరికాలో ఉద్యోగాలు దొరికాయి. రెండు కుటుంబాలు ఏంతో అన్యోన్యంగా ఆనందం గా జీవనం సాగించాయి. ఓ ఆరు మాసాలు గడిచాయి. మాధవి తల్లిదండ్రులు కూడా అమెరికాలో ఉండేలా నిర్ణయించుకున్నారు. ఓ ఏడాది గడిచింది. ఆ పల్లెటూరును శాంతమ్మ అల్లుడ్లు దత్తత తీసుకున్నారు. పల్లెటూరు కాదు.. పట్టణం అనేలా అన్నీ మౌలికవసతులు కలిపించారు. సరదాగా ఆ గ్రామం అల్లుడ్లు గ్రామం గా విరాజిళ్ళుతుంది. నిజమైన ప్రేమ చాలా గొప్పది. అది ఎక్కడ ఉండాలో, ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది అనే ఓ పాశ్చాత్య కవి ప్రభోదం అక్షర సత్యం అయింది ఈ కథ లో ప్రేమా నీకు వందనం అభివందనం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!