మధన పెట్టే నిశి రాత్రి

అంశం: నిశి రాతిరి

మధన పెట్టే నిశి రాత్రి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎస్.ఎల్.రాజేష్

తరగని ఆలోచనలతో మది కుస్తీ పడుతోంది
నిశి రాతిరిలో..
ఎన్నో అంతరంగాలు
అవస్థ పడుతున్నాయ్ నిదుర రాక నిశి రాతిరిలో..
తాగొచ్చి కొట్టి పడుకున్న భర్తను చూస్తూ
ఓ భార్య ఆవేదన పడుతుంది
నిశి రాతిరిలో..
తెల్లారితే పరీక్ష ఉందని పుస్తకాలు ముందేసుకుని
మగత కనులతో కుస్తీ పడుతోంది ఓ పిల్ల
నిశి రాతిరిలో..
జరగబోయే ఎన్నికల కోసం ఓ నాయకుడు
పావులు కదుపుతున్నాడు
నిశి రాతిరిలో..
అమ్మ పక్కన బొజ్జున్న పసి పాప
బోసి నువ్వులతో మారాం చేస్తుంది
నిశి రాతిరిలో..
ఏ ఇంట్లో చొరబడదామా అని
విశ్వ ప్రయత్నం చేస్తున్నాడొక దొంగ
నిశి రాతిరిలో..
దుప్పట్లో దూరి ప్రియుడితో
సెల్ ముచ్చట్లు పెట్టింది ఓ పడతి
నిశి రాతిరిలో..
వీథి చివరన ఒంటి పై బట్ట లేకున్న
ఆదమరచి నిద్రపోతున్నాడు ఓ బిచ్చగాడు
నిశి రాతిరిలో….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!