హరిహరుల ప్రీతిమాసం ‘కార్తికం!’

హరిహరుల ప్రీతిమాసం ‘కార్తికం!’

రచన: సుజాత.పి.వి.ఎల్,

ప్రాతః కాల నదీ స్నానం
శుభప్రదం..ఫల ప్రదం..
కోర్కెలు తీర్చే
కోటి దీప జ్యోతిర్మయం..
నిండు పున్నమి వెలుగు
దివ్య జ్యోతుల దేదీప్యమానం..
కమనీయ కాంతుల కిరణోత్సవం..
సద్గతులనొసగే సంధ్యా దీప దర్శనం..
పుణ్యఫల ప్రాప్తినిచ్చు
ఉసిరి దీప దానం..
సకల వ్రతాలకనుకూల మాసం..
ద్వాదశి..తులసీ కల్యాణం
ఈ మాస ప్రత్యేకం..
మది నిండా భక్తి పారవశ్యం..
మగువలకు సౌభాగ్యదాయకం..సర్వ శుభదాయకం..
కార్తిక మాస మహోత్సవం..
మనసుకు ఆధ్యాత్మికోత్సవం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!