అనుభవాల సోయుగం

అంశం: మన్మధబాణం

అనుభవాల సోయుగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీ వీ నాయుడు

మన్మధుడు కావాలి ఆదర్శం
ప్రతి ఇంట నిలవాలి ఓ మన్మధ బాణం
అదే ప్రతి జంటకు ఓ వరం
అవుతుంది ప్రతి ఇల్లు ఓ మనోహరం
మన్మధుడు అవతరించిన వేళ
కలకాలం సుఖ సంతోషాలు ఇలా
చంద్రబింబ కాంతిలో మన్మధుడు
సోయుగాల సొగసు కౌగిళ్లలో
నూతన వధూవరులను
మేళవించు వేళ
ఆనందం అమృతమై రంజింపు వేళ
ఆ మన్మధుడు ప్రతి ఇంటా
అవుతాడు ఓ ఆరాధ్య దైవం.
అవుతుంది జీవితాంతం ఓ
అనుభవాల సో యుగం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!