ప్రేమ

 ప్రేమ

రచయిత :: స్రవంతి

నీ నయనాలను వీక్షించిన నాడు నే తేలిపోయాను ఊహలలో…

నా కనురెప్ప కాలం లో కూడా నిన్ను వీడను సఖి..

నీ నయనాలను తాకిన కాటుకను అడుగు ఎంత అదృష్టం చేసుకుందో..

నా కంటికి ఎంత ఆశో..
నీ కనురెప్పగా మారాలని..

నీ నయనాల నడుమ చిక్కుకున్న నా మనసు
నీకై పరితపించి పోయింది..

నీవు దూరమైన వేళ…
తడిసి ముద్దయిన కనులకు
నిదుర కరువై కనులు వడలి పోతున్నాయి..

నీ క్రిగంటి చూపుల మన్మద బాణాలతో నా మనసును మాయ చేసావు సఖి…
నా కనులలో దాగిన ప్రేమ కల కాదు ..
నీ కనులలో దాగిన నా మనసును అడుగు సఖి.

నా కనులు నిన్నే చూడాలని
నా మనసు నిను చేరాలని వేచి చూస్తోంది సఖి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!