చెదిరిన సుగుణ కల
రచయిత: ధనలక్ష్మి

అదో మారుమూల గ్రామం. ఆ ఊరి పెద్ద చక్రవర్తి
పేరుకు తగట్టే ఆ ఊరికి చక్రవర్తి అని ఆయన చెప్పిందే వేదం ,చేసేదే న్యాయం. ఇంట్లో కూడా అతని భార్య అన్నపూర్ణ దేవి అతను గీచిన గీత దాటదు.కొడుకు కృష్ణ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఏమి చెప్పితే అది చేస్తూ ఉంటాడు.కూతురు సుగుణ. తనకి అందరి అమ్మాయి లాగ స్వేచ్చ గా ఊరిలో తిరగాలి అని ఆశ..అందరితో కలిసి ఆడుకోవాలని ,సరదాగా ఉండాలి అని కోరిక.
తనని చిన్నప్పటి నుంచి ఇంటి లోపలే బందించి , చదువు దగ్గర నుంచి అల్లికల వరకు అన్ని విద్యలు గురువులే ఇంటికి వచ్చి నేర్పించేవారు.
సుగుణ తన రూమ్ కిటికీ దగ్గర నిలబడి వీధిలో వాళ్లను, వీధి చివర ఉన్న రంగయ్య చిల్లర కొట్టును
చూస్తూ ఉండేది…
అలా ఒక రోజు అలా చూస్తున్న సుగుణ చెవులకు వినసొంపైన పాట వినపడింది. పిల్లనగ్రోవి సహాయంతో చక్కగా పాడుతున్నాడు పాట.. ముఖ్యంగా పిల్లనగ్రోవి తో వచ్చే సంగీతం ఎంతో శ్రవణానందం గా ఉంది దూరం నుంచి చూస్తే అతని రూపం కనపడలేదు..సుగుణ అతన్ని చూడాలి అని అనుకుంది కానీ సరిగా కనపడటం లేదు..అతను రోజు ఆ రంగయ్య కొట్టు దగ్గరకి రావడం పిల్లనగ్రోవి ఊదుతూ, అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడు..సుగుణకి అతను ఎలా ఉంటాడో తెలీకపోయినా అతన్ని ఆరాధించడం మొదలు పెట్టింది…
రోజు లాగే కిటికీ దగ్గర నిలబడి అతని పాట కోసం ఎదురు చూస్తుంది. కానీ ఎందుకో అతను రాలేదు..
ప్రతి రోజు కిటికీ దగ్గర నిలబడడం అతని పాట కోసం ఎదురు చూస్తూ ఉండేది.. కానీ అతను రాలేదు ….
సుగుణకి అర్థం అయింది అతన్ని ప్రేమిస్తోందని.
తన బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు . తనకి స్నేహితులు కూడా ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళ నాన్నకు భయపడి ఎవరు వచ్చేవారు కాదు…పాపం అతని మీద బెంగతో జ్వరం కూడా తెచ్చుకుంది…నిద్రాహారాలు
మానివేసింది..
ఒక రోజు సుగుణకి అతను సాధారణంగా పాడే పాట వినపడడం తో ఆశగా వీధి చివర ఉన్న కొట్టు దగ్గర చూసింది కానీ ఎవరు లేరు.. నిరాశగా వెను తిరిగిన తనకు మళ్లీ పాట వినపడటం తో అది తన ఇంట్లో అని పరుగున కిందికి వెళ్ళింది..అక్కడ కొంతమంది కళాకారులు వారి విద్యను వాళ్ళ నాన్న ముందర ప్రదర్శిస్తున్నారు..
సుగుణ కళ్ళు వెతికాయి.ఇంతలో అన్నపూర్ణాదేవి తల్లి నీ కోసమే రా ఇవి వింటే నువ్వు కొంచం కోలుకుంటావు అని మీ నాన్న గారు పిలిపించారు..ఈ పాలు తాగుతూ విను..
ఇంతలో ఒకతను తను పాట పాడుతూ పిల్లనగ్రోవినీ ఉదాడు..సుగుణ కళ్ళు విచ్చుకున్నాయి..తను ఊహించుకున్నట్టు అందంగా ఉన్నాడు…
అతను చక్రవర్తిని వినయంగా నమస్కరించి
” అయ్య నేను పక్క గ్రామంలో పిల్లలకు సంగీతం నేర్పించడానికి ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేశాను ..మీ చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవం జరగాలి అని మనవి చేసుకుంటున్నాను… నేను మీ వీధి చివర కొట్టు దగ్గర కూర్చొని పాట పడుతుంటే మీకు నేను ఎవరో తెలియక పోయిన డబ్బు ఇచ్చి నన్ను ప్రోత్సహించడమే కాకుండా ఒక చక్కని పిల్లతో వివాహం జరిపించారు. మీ కన్న నాకు ఇంకా ఎవరు ఆప్తమిత్రులు ఉంటారు…అందుకే రేపు వచ్చి మీ చేతుల మీదుగా కార్యక్రమం జరగాలని ఈ పేద కళాకారుడి దంపతుల విన్నపం.
తప్పకుండా సూర్యుడు రేపు వచ్చి నువ్వు అనుకున్నట్టుగానే ప్రారంభిస్తా ను…
ఇంకా మేము వస్తాం అయ్య…సూరీడు కొద్దీ సైపు అగు…
అన్నపూర్ణా గారి వైపు చూసి సైగ చేశాడు. .ఆమె వెళ్లి ఒక పళ్లెంలో చీర, పళ్ళు, కుంకుమ భరిణ తీసుకొని వచ్చింది..
అమ్మ సుగుణ అని పిలిచేoతవరకూ ఈ లోకంలో లేదు తను…
తల్లి నీ చేతుల మీదుగా ఈ నవ దంపతులు కి ఇవ్వు అని వాళ్ళ నాన్న చెప్పడంతో ఇచ్చింది…
వాళ్ళు ఇద్దరు సుగుణకి వినయంగా నమస్కరించి వారి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు ..
సుగుణ పరుగున తన రూంకి వెళ్లి గట్టిగ ఏడ్చింది…
నాకే ఎందుకు ఇలా జరగింది..నా ప్రేమను ఎలా తెలపాలి అనుకుంటూ ఉంటే ఈ లోపు అతనికి వివాహం జరిగిపోయింది తనలో తాను బాధ పడి ,నా తలరాత ఇంతే అని అతన్ని మర్చిపోయింది.
కొన్ని రోజులకు వాళ్ళ నాన్న నిశ్చయించిన అతనితో వివాహం చేసుకుని వెళ్లిపోయింది
చక్రవర్తి కిటికీ దగ్గర నిలబడి వీధి చివర ఉన్న కొట్టును చూస్తూ పిచ్చి సుగుణ నువ్వు పెంచుకున్న ప్రేమను చూసే నేను అతనికి కావాలనే డబ్బు సహాయం చేసి వివాహం కూడా జరిపించాను.ఊరిలో ఏమి జరగిన తెలుసుకునే నేను ఇంటి గురించి ఎలా మర్చిపోతాను అనుకున్నావు నవ్వుకున్నాడు.
***
