పల్లే జ్ఞాపకాలు

పల్లే జ్ఞాపకాలు

రచయిత ::సుజాత.కోకిల

అమ్మ ఆమ్మమ్మ ఊరువెలుదాము అనేసరికి చెంగునగంతు వేసాను అమ్మమ్మ ఊరంటే చాల ఇష్టం ప్రతి వేసవిలో సెలవులకి అక్కడికే వెలుతాము.అక్కడికి వేళ్లామంటే పండుగ వాతావర్ణమే ఉంటుంది.ఎంత అల్లరి చేసేవాళ్లం మామయ్య పిల్లలు తమ్ముడు నేను ఒకటే గొడవ ఒకరిమీద ఒకరం చాడీలు చెప్పుకుంటు ఇంట్లో వాళ్లని ఒకటే విసిగించే వాళ్లం. మా పంచాయితీ అంతా మా తాతకే చేప్పే వాళ్లం మా తాత ఓపిగ్గా అందరికీ సర్థిచేప్పిఅందరిని మళ్లి కలిసి ఆడుకోమనేవారు.అలాగే అంటు బుద్దిగా వెళ్లిఆడుకునేవాళ్లం.

అది చిన్న పల్లేటూరు చుట్టూ పచ్చని పొలాలు అక్కడక్కడా మామిడితోటలు గళగళలా పారే గోదావరి ఎటుచూసినా పచ్చదనంతో నిండిన పంటచేనులూ ఆ ఎడ్లబండిలో వెళ్లుతుంటే ఆ మజానే వేరు మనం వెళ్లేదారిలో అటుఇటు రెండుపక్కల ఆ చెట్లకొమ్మలు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉండేవి మల్లి ఇన్నాళ్లకు వెలుతున్నాము.అంటే అన్ని ఒకక్కటీగ గుర్తుకొస్తున్నాయి.

ఊర్లోకీ వెళ్లగానే. రెండు మూడు పచారి కొట్లు ఉన్నాయి మా తాత ఎప్పుడు మాకు డబ్బులు ఇచ్చేవారు మామయ్య పిల్లలు.వీదిలోని పిల్లలమంతా అక్కడికి వెళ్లి మాకు ఇష్టమైనవి కొనుక్కునే వాళ్లం.అప్పుడు ఎంత బాగుండేదో మా చిన్నప్పటి ఫ్రేస్సు లత కామాక్షి వీణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మేము నలుగురం అల్లరి చేస్తు ఊరువాడ అంతా కలియ తిరిగే వాళ్లం.

ఒకరోజు జామచేట్లు ఎక్కి జామకాయలు కొస్తుండగ తోట ఎజమాని వచ్చి ఎవరు అంటు గట్టిగా అరుస్తుంటే మొహాలు కనబడకుండా పరిగెత్తిన రోజులు గుర్తుకువస్తుంటే ఎంత నవ్వు.వస్తుందో కామాక్షి ఎన్ని తిట్లు తిట్టిందో నన్ను విడిచిపెట్టి వెలుతార అంటు ఇప్పటికి గుర్తుకు వస్తే నవ్వు అపుకోవడం కష్టం

పల్లేటూరుయిన అన్ని వస్తువులు ఇక్కడ దొరికేవి అన్ని బాగుంటాయి కాని అమ్మమ్మ వద్దు అనేది పాతస్టాక్ ఉంటాయి ఎందుకమ్మ అని.అయిన మాతాత అలా ఏమ్ లేదమ్మ అన్ని బాగానే ఉంటాయి శెట్టి కూడ ఇప్పుడు సిటి నుండి ఫ్రేస్సువి తెస్తున్నాడు ఇక్కడ అందరు అక్కడే కొనుక్కుంటున్నారు అని మా తాతయ్య సర్థి చెప్పి మమ్మల్ని తెచ్చుకోమ్మని చేప్పి మళ్లీ శెట్టికి ఫోన్ చేసి మా పిల్లలు వస్తున్నారు ఎది కావాలన్నా ఇచ్చేయి నేను డబ్బులు పంపిస్తాను.అని చెప్పేవారు మేము అడిగిందల్లా ఇచ్చేవారు.మేము ఉన్నన్నాళ్లు వాల్లకు గిరాకీ ఉండేది.

చిన్నచిన్న కిరాణా వస్తువులు అన్ని ఇక్కడే కొంటారు
సిటీకి వెళ్లినప్పుడు పెద్దవి ఇక్కడ లేనివి ఎక్కువగా తెచ్చుకుంటారు సిటిలో కంటే ఇక్కడ.పదిరూపాయలు ఎక్కువనే ఉంటాయి మరి వాళ్లు కూడ బతకాలి కదా
అంటారు మా తాతగారు మనం ఒక్కసారిగా ఇవ్వడం లేదుగ మరి అవసరం పడితే. ఫోన్ చేస్తే ఇంటికి తెస్తారు చీటికిమాటికి సిటికి ఎవరు పోతారు పచారుకొట్టుకి ఎవరు పోతారు అని మా అమ్మమ్మను కోప్పడేవారు.అమ్మమ్మ మౌనంగా ఉండేది

అప్పటికి ఇప్పటికి రోజులు కూడ చాల మారాయి. ఇప్పుడు అందరికి వేకిల్స్ కార్లు ఉన్నాయి.ఎన్ని ఉన్న ఎదో ఒకటి మనకు అవసరం పడుతునే ఉంటుంది.
నాన్న అమ్మమీద కూడ అరుస్తారు నువ్వు మాటిమాటికి ఇది లేదు అది లేదని తేపకు చెపుతావు ఒకేసారి ఎవి.చేప్పవని అమ్మపై కోపం చేసేవారు అమ్మ పని ఒత్తిడితో మరిచి పోతుంది అదే నాన్నకు కోపం మరిచి పోతుంటారు కామనే తనదితానే నవ్వుకుంది.

అమ్మ అని అరవడంతో తన జ్ఞాపకాలనుండి వాస్తవంలోకి వచ్చింది ఎంటిర అలా అరిచావు ఇ కొమ్మ గీరుకుంది ఎంటి నీవు ఇంక చిన్నపిల్లాడివ ఎంటి బైటకు చేతులు పెట్టడం ఎంటి ఎదో పెట్టాను లేవే గీరుకుంటుందని నాకు ఎమ్ తెలుసు చూడమ్మ అక్క లే పాలు తాగే బుజ్జిగాడు మరి ఊరుకోండిర మీ గొడవలు మీరును ఎప్పుడు గొడవలేనా అంది తల్లి. శాంతమ్మ ఆమే పేరుకు తగ్గ శాంతమూర్తే పిడగులు మీద పడ్డ మాట్లాడదు.

రామయ్యతాత ఇంక ఎంత దూరం అన్నాడు ఇంక వచ్చేస్తుందిలే బాబు అన్నాడు.చిన్నప్పటినుండి రామయ్యతాత మా అమ్మమ్మ వాళ్లఇట్లోనే పాలేరుగ
చేసేవాడు మమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించాడు అందుకే రామయ్యతాత ఆనే పిలుస్తాము అదే అలవాటు మేము రాక మూడు సంవత్సరాలు అయింది.నేను ఇప్పుడు ఇంటర్ తమ్ముడేమో నైయిత్తు క్లాస్ చాల స్పీడుగా గడిచిపొతుంది కాలం ఇప్పుడు కరోన పల్లేటూరిలో కరోన ప్రభావం ఎక్కువగా లేదని ఇక్కడికి వస్తున్నాము

ఇప్పుడు అన్ని ఆన్లైన్ చదువులే కదా ఎక్కడైన ఉండి చదువుకొవచ్చు కదా అని అమ్మ దిగండి అనడంతో అమ్మయ్య అమ్మమ్మవాళ్ల ఊరుకు వచ్చేసాము చాల సంతోషంగా ఉంది అందరు మా కోసం ఎదురు చూస్తుంటారు.

నా జ్ఞపకాలను మీతో షేర్ చేసుకున్నాను
ఇప్పుడు నేను మా అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్తయ్యలతో సంతోషంగా కబుర్లు చేప్పుకుంటూ ఎంజాయ్ చెస్తాను బాయ్ మళ్లి ఎప్పుడైన మీతో షేర్
చేసుకుంటాను🙏🙏

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!