స్వభావం

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

స్వభావం

రచన: సంజన కృతజ్ఞ

అమ్మమ్మగారి ఊరు అంటే నాకు చాలా ఇష్టం .
మా అమ్మ పొద్దుగాల లేసి టీవీ లో భక్తి ఛానల్ పెట్టి వినుకుంట తన పనులను చేసుకుంటూ ఉంటుంది.
నేను మా అమ్మతో కలిసి బయటికి వెళ్తాను.
నేను చాలాసార్లు మా అమ్మమ్మ తో సినిమాకి వెళ్లాను.
అక్కడ నాకు భద్రకాళి గుడి చాలా ఇష్టం.
నేను వెళ్ళినప్పుడల్లా
షాపింగ్ చేస్తాను.
నేను వెళ్ళినప్పుడల్లా నేను మా అమ్మమ్మ కలిసి పడుకునే వాళ్ళం .
నేను ఏదో ఒక కథ చెప్పు అని అడిగేదాన్ని అప్పుడు మా అమ్మమ్మ నాకు చెప్పిన కథ…

ఒక సాధువు కాలువ గట్టు వెంబడి నడుస్తుండగా తేలు నీటిలో పడి పోవడం చూసి కాపాడదామని కర్రపుల్ల తో పైకి తీస్తే అది అతని చేతిని కుట్టేస్తుంది రక్తం కారుతుంటే వదిలేస్తాడు, మళ్లీ కాపాడతామని పైకి తీస్తే మళ్లీ చేయిని కుడుతుంది జారవిడిచాడు మళ్లీ కాపాడుతామని ప్రయత్నంలో పైకి తీస్తే చేతిని కుట్టి కుట్టి రక్తసిక్తం చేస్తుంది ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నా వ్యక్తి సాధువుని నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు కాపాడదామని చూస్తుంటే అది నిన్ను కుట్టి రక్తమయం చేసిన పట్టించుకోక మళ్లీ దాన్నే కాపాడదామని చూస్తావేం అంటాడు దానికి ఆ సాధువు నాది కాపాడే స్వభావం దానిది కుట్టే స్వభావం ఎవరి పరంగా వారు న్యాయం చేస్తున్నారు అంటాడు!
*********
నీతి: మన వ్యక్తిత్వమే మన స్వభావాన్ని తెలియజేస్తుంది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!