మా ఇంటి వంట

మా ఇంటి వంట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం ముందే మా ఇంట్లో వంటింటి లో కాఫీ ఘుమ ఘుమ లతో కాఫీ రాగం మొదలు అవుతుంది. ఓ సారి ఏ మయిందంటే మాఇంటి వంట అద్భుతంగా ఉంటుంది. విశ్వహిందూ పరిషద్ వారు గృహ భోజనాలు మాత్రం తింటారు. తెలుసున్న వారు ఇంటికి వచ్చిన ప్రముఖుల్ని పిలుస్తారు. అది ఒక సంప్రదాయము వంట వార్పు కి ఇంట్లో ఒక మనిషిని పెట్టేవారు తాత గారు
మంచి సంఘ్ సంస్కర్త అని పేరు. అమ్మమ్మ ఎక్కువ కష్ట పడకుండా పని మనిషి వంట మనిషి ఉండేవారు. ఏ సమయం లో మనిషి వచ్చిన భోజనం వండి పెట్టేవారు కొందరికి మడి అచ్చరం ఉండేది. మా ఇంటికి తరచూ ఆత్మీయులు బంధువులు స్నేహితులు కళాకారులు కవులు వస్తూ ఉండేవారు. వారు అందరికి ఆతిథ్యం ఉండేది.
ఒక సారి ఒక మధ్యాహ్నం వేళ విశ్వహిందూ పరిషత్ నాయకులు ఇద్దరు వచ్చారు. సరే రెండు గంటల వేళ వంట చేసి పెడతాము అన్నది. మజ్జిగ అన్నం చాలు మేము సమయం తప్పి వచ్చాము. వేరే హోటల్ లో పెట్టీ స్తాము అన్నారు మేము హోటల్స్ లో తీనము కదా అందుకని మీ విషయం మాకు తెలుసు, మీ ఇంట ఎప్పుడు అన్నపూర్ణ రెడీ గా ఉంటుంది అన్నారు. అదికాదు అన్నం కూర వండి పెడతాము రాక రాక వచ్చారు మళ్లీ వస్తారా ఏమిటి? కాస్తా విశ్రాంతి తీసుకోండి. ఈ లోగా ఈ పనస తొనలు తినండి అని పెట్టారు. అని అమ్మమ్మ గబగబా సేరు బియ్యం పోసి వంట ఆమెకు ఇచ్చింది
క్యాలి ఫ్లవర్ వండి చారు పర్తని చెప్పింది అంతా కలిసి ఏవో మాటల్లో ఉన్నారు. అమ్మమ్మ మాత్రం వంట ఆమెకు సలహాలు ఇస్తోంది. క్యాలి ఫ్లవర్ నీ నాలుగు కోమలుగా లాగి కుక్కర్లో పెట్టింది తోందరగా అవ్వాలని చెప్పటం తప్పి అయ్యింది. మూడు కూతలు రాగానే దింపి చల్లార్చి పెట్టింది మిర్చి అల్లం జీలకర్ర ధనియాలు మెత్తగా మిక్సి పట్టింది. బాణలిలో నూనె వేడి చేసి వడియాలు చల్ల మిరప కాయలు వేచి పెట్టీ అందులో కొంత నూనె తీసి డబ్బాలో పోసి మిర్చి ముద్ద వేయించి అందులో క్యాలి ఫ్లవర్ కడ్డిలతో ఉన్న ఉడికిన గుత్తులు వేసి కలిపి కొంచెం పచ్చి కారం చల్లింది చారు పెట్టింది.
వంట పూర్తి అని గరిటె చప్పుడు చేసింది. ఆకులు వేసి టెంక మెంథికాయ వడ్డించి మిరప కాయలు వడియాలు వేశారు. ఇంకా కూర పట్టుకురా అనగానే
బేసిన్ లో కూర తెచ్చింది. ఇదేమిటి ఇవి ఇలా ఉన్నాయి మేము నాన్ వెజ్.తినమని తెలుసు మీరు శాఖ హరులు కదా అన్నప్పుడు, మా అమ్మమ్మ నవ్వి ఇవి కలిఫవర్ కడ్డీల కూర అండి అతి తోందరగా అవడానికి ఇలా నాలుగు కొమ్మలు చేసి
ఉడికించిన ది అంతే కాని మా ఇంట్లో ఎలా నాన్ వెజ్ పెడతాము అన్నది. అదే కదా మీరు పూర్తి స్తోత్రికుల కుటుంబం అని వచ్చాము. మేము ఉద్యోగ రీత్యా క్యాంపులు వెళ్ళినా అన్ని చోట్ల భోజనం చెయ్య ము మజ్జిగ పాకెట్స్ కోని తాగుతాము అన్నారు. పర్వాలేదు మాకు పుణ్యం ఇవ్వడానికి మీరు వచ్చారు, నేను చెపుతున్నాను తినండి అంటూ అమ్మమ్మ వడ్డించింది. మా కాకర పర్రూ మెంతి టెంక పెరుగు అన్నంలో జుర్రుకుని మరీ తిన్నారు. మీకు కొంచెం డబ్బాలో పెట్టి ఇస్తాను పట్టు కెళ్ళ మని చెప్పింది అంతా పెద్ద ఆఫీసర్లు అలాగే అని సుస్తాంగ భోజనం చేసి కాసేపు మాట్లాడి ఆ డబ్బాలు పుచ్చుకుని వెళ్లారు. మరో సారీ ఇంటి అల్లుడు వస్తాడు. కంచం నీళ్ళు పెట్టు అనిచేపితే
పిట.వేసి కంచం పిట కింద తో సి నీళ్ల గ్లాసు పిట పై పెట్టింది. అమ్మ మ్మ వెళ్లి చూసి ఇలా పెట్టవు ఏమిటి అన్నది దానికీ మీరు ఇలా చెప్పారు, అనుకున్నాను. అన్నది..విచిత్రం ఏమిటి ఇలా పెట్టింది అని అంతా నవ్వారు, మా ఇంట్లో చుట్టలమ్మాయి చిన్న పిల్లని తీసుకు వచ్చింది అది కాస్తా పులుసు గిన్నె పట్టుకుని అందరికి వడ్డి స్తాను అన్నది. వద్దు వద్దు దానికి ఇవ్వ కండి అది పులుసు పారబొస్తుంది. తాగుతూ ఉంటాను ఇమ్మని అంటుంది ఇవ్వకండి అని చెప్పింది మనుషుల పనులు రక రకాలుగా ఉంటాయి. అయిన సరే వంట మనీషి దగ్గర ఉండి పని. చేయించాలి లేకపోతే వంట బాగుండదు. నలుగురు తినేలా రుచిగా వండాలి ఆ మధ్య పెళ్లి అయ్యింది. అక్కడ వంట దగ్గర అమ్మమ్మ ఉండి వంట చేయించింది ఇప్పటికీ కొన్నిపెల్లిళ్ళల్లో క్యాట రింగ్ కాక వంట వాళ్ళని పెట్టీ వండిస్తారు. పెళ్ళిలో శ్రీ వేంకటేశ్వర దీపారాధన శ్రీ సత్య నారాయణ వ్రతము పూర్తి అయి నివేదనలు రెడీ చేస్తారు. క్షీరాబ్ది కన్యకకి అనే మంగళ హారతి శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన పాడే సమయానికి మహ నివేదన రెడీ గా తెచ్చి ఉంచుతారు ఇంచుమించు మా అమ్మమ్మ మా చుట్టాలు ఇంట్లో పెళ్లికి సార్ అరిసెలు మిఠాయి ఉండలు కాజాలు సున్ని ఉండలు దగ్గర ఉండి చెప్పి చేయిస్తుంది. ఒక సారి మా ఇంటికి తాతయ్య మిత్రుడు స్కూల్స్ డీ ఈ ఓ రిటైర్డ్ ఆయన మంచి కవి డాన్సర్ కూడా ఆయన వచ్చినపుడు
మా మనుమరాలు రెండు ఐటమ్స్ చెప్పు అని చనువుగా అన్నాడు, దానికి ఆయన గోంగూర పాట గుత్తి వంకాయ వంగ తోట పాట నేర్పారు దానికి ఫేస్ గా మెంతిగాయ ఊరగాయ డబ్బుతో ఇచ్చారు. గోంగూర పచ్చడి రెండు కేజి లు డబ్బాలో ఇచ్చారు మామిడికాయ పప్పు పొలం నుంచి తెచ్చిన గుత్తి వంకాయ కూర వండి పెట్టామన్నారు అలేగే పెడితే ఆయన జీవితం లో మీ ఇంటి వంట మరువ లెను అని అంటారు. భోజనం ఎప్పుడు రుచిగా శుచిగా ఉండాలి వంట వారి వెనుక ఇంటి వారు ఉంటే గాని పని సవ్యంగా చేయరు. అయిన ఇప్పటికీ మా ఇంట్లో నలుగురు వస్తున్నారు అంటే వంట మనిషిని పిలుస్తాము. దాని వెనుక ఉండి మేము వండి పెడతాము, పేరుకే వంట మనిషి మా వెనుకాల పని చెయ్యాలి కాని అసలు వంట అమ్మ అమ్మమ్మ చేస్తారు. నాకు వంట బాగా అలవాటె, ఆధునిక వంటలు కొత్త వంటలు ఎన్నో చేస్తూ ఉంటాను. రెసిపీ స్పెషలిస్ట్ ను కూడా వంట తరువాతే ఏపని అయిన వంట ఇంటి నిత్య యజ్ఞము అని మా ఇంట్లో అన్నపూర్ణ సేవ అద్భుతంగా వంట చేస్తాము. మీ ఇంటి వంట జీ తెలుగు వారు వచ్చి కూడా నా వంట మెచ్చుకున్నారు. ఈ టివి అభిరుచి లో హర్లిక్స్ వంటకం వరల్డ్ మొత్తం మీద ప్రైజ్ వచ్చింది హార్లిక్స్ సేమ్యా ఖేర్ అండి తింటే వదలరు ఆ షేఫ్ గారు ఎంతో మెచ్చుకున్నారు. మా ఇంటి వంట అంతా ఘనమైనది, రుచికరమైనది ఎవరూ వచ్చినా మా ఇంటి వంట అంతా ప్రియము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!