(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
వన్నెల దొరసాని
రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )
ఆకాశానికి నిచ్చెన వేసి చూస్తున్నా
సప్త వర్ణాలలో దాగిన వసంతం నువ్వేమోనని
సముద్ర గర్భంలో వెతుకుతున్నా
ఆల్చిప్పలో నిలిచిన స్వాతిముత్యం నువ్వేమోనని
ఉదయించే సూర్యుడిని అడుగుతున్నా
నులివెచ్చని కిరణాల ఉషస్సు నువ్వేమోనని
ప్రకృతిలో అందాన్ని ఆరాధిస్తున్నా
పచ్చని సోయగాలను దాచుకున్న హరిత నువ్వేమోనని
చల్లని వెన్నెలమ్మని ప్రశ్నిస్తున్నా
చందమామలో నిలిచిపోయిన నీహారిక నువ్వేమోనని
నిశీధి రాత్రిలో అన్వేషిస్తున్నా
కలల్ని నిజం చేయడానికి వచ్చిన దేవకన్య నువ్వేమోనని
పుడమి తల్లిని కోరుకుంటున్నా
నా కోసమే పుట్టిన నా ప్రాణాన్ని నా దరికి చేర్చమని
బాగుంది క్రాంతి👍👍
Thanks 🤗 Bujjamma