(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
తీరని కల
రచయిత :: మక్కువ. అరుణకుమారి
పాలుగారే పసిప్రాయాన
పున్నమి చంద్రునితో చేరి
పరవశించాలనుకోవడం తప్పు కాదు
ఉరకలు వేసే నిండు యవ్వనాన
జాబిల్లి లాంటి జవ్వనితో
జతకూడాలనుకోవడం తప్పు కాదు
పరిపూర్ణత సంతరించుకున్న ఫ్రౌడ ప్రాయాన
చెంతనున్న జీవన మాధుర్యాన్ని ఆస్వాదించక
ఎపుడో మసకేసిన మబ్బుల్లోని
ఆ నెలరేడును ఇలకు దించాలనుకోవడం తప్పుకాదా!
ఆ అందరాని చందమామను అందుకోను
ఆకాశానికి నిచ్చెనలు వేస్తే
తెరతీస్తుందా?
దివి నుండి భువికి దిగి వస్తుందా?
నిను వరిస్తుందా?నీ కల తీరుస్తుందా?
చాలా బాగా రాశారు ..నిజం తెలియజెప్పారు