సొగసు చూడతరమా
కలువ భామ ల నుండి వచ్చెన వాలుకనుల సోయగాలు
హంసల నుండి వచ్చెన నీ నడకలో హొయలు
మెరుపుతీగలాయె నీ నాజూకు నడుము లు
వాలుజడ వయ్యారాలు తేనె సొగసుల సింగారాలు
అబద్ధమాడకు అరువు తెచ్చిన వి కావని నీ అందాలు
ఓరకంట చూచితివా జారెనే గుండెలు
నిన్ను చూసిన వారికి అగునే మనసులు విరహ సంద్రాలు
ఓ ఇంతీ వర్ణింపనలవి కావే నీ సోయగాల సిరి చందనాలు
ఓ కోమలి కుసుమమా నీ సొగసు చూడ తరమా…
రచన :అనిల సందీప్