మంచి మనసు
మంచితనం తోడు ఉంటే
విజయం మన వెనకాలే
నీ నా అన్న తేడాలు లేకుంటే
అందరు మన బంధువులే
ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా
మనకున్నది వెంట ఎది రాదు
కష్టాలలో ఉన్నప్పుడు నేను ఉన్నాననే
దైర్యం ఉంటే చాలు ఎంతటి కష్టాన్నైనా
ఎదుర్కొనే ఆత్మస్తైర్యం ఉంటే చాలు
మనిషికి గుండె ఎంత ముఖ్యమో
మనిషికి ఆత్మస్తైర్యం అంతే ముఖ్యం
కష్టాలలో ఉన్నప్పుడు వెన్ను తట్టని
బందువులు ఎడారిలో ఎండమావులే
అమృతంలో చిన్న విష బిందువు రాలిన
అమృతం అంతా విషతుల్యమే అయినట్టు
మనిషిలో స్వార్థపూరిత బావాలు ఉన్నవాడు
పైపై మెరుగులు ఎన్ని దిద్దిన లెక్కలో లేనివాడే
స్వచ్చమైన భావాలతో నీటి మంచులా కరిగి పలువురు మెచ్చిన మార్గం ఎంతో మేలు
నిజాయితే నా ఊపిరిగా జీవించినంత కాలం
సర్వస్వమే నాదై క్రొవ్వత్తిలా కరిగిపోతు
త్యాగజీవినై పుడమిలో అంకితమౌతా🙏
రచయిత :: సుజాత. కోకిల