అనుబంధం

అనుబంధం

రచయిత:డేగా.వి.ఆర్.రెడ్డి,

ఎక్కడో

ఓ కలయిక,

లీలగా

ఆ జ్ఞాపకం!

 

ఎవరో

తెలియదు,

ఎప్పుడో

గుర్తులేదు!

 

ఎందుకో

ఆ మమేకం,

ఎప్పటిదో

ఈ వివేకం!

 

ఇంతకూ –

ఆ రూపం

ఏ లావణ్యమో,

ఆ చకిత

ఏ స్నేహమో!

 

అస్పష్ట‌ంగా

వెంటాడుతూ,

హృదయాన్ని

వేటాడుతూ!

 

తెలియని

ఓ అనుబంధం,

మనసుని

తొలిచేస్తూ!‌‌

 

తెమలిన

తమకం,

తపనకు

శృతిచేస్తూ!

 

మరింతగా –

 

మాట‌ల్లేని

ఏదో అనుభవం,

అనుభూతుల

దొంతరగా!

 

ఆ బంధం

జీవిత కాలంగా,

ప్రాణగత

ప్రబంధంగా!

 

ఎక్కడో..

 

ఏదో

ఒక ఊహ,

స్పష్టాస్పష్ట‌తల

ఊగిసలాట‌!

 

లీలగా..

లయబద్ధంగా..

ఎద తరంగితంగా..

స్థిత జ్ఞాపకంగా!

 

రసావలోకనం చేస్తూ..

 

సొగసు

వలువలుకట్టి‌,

తెలిమబ్బు

తూగుటూ‌యలపై..

 

నిండుమల్లి పరిమళం,

శ్వేతగులాబీ సౌందర్యం

రంగరించి

పోతపోసినట్లుగా..

 

అహో..

 

ఎవరు ఎవరది

ఈ భ్రమర భ్రమణానికే

నిర్దేశమా..! కాక,

నే ‘ప్రవర’ స్మరణమా..!!

 

ఓహ్..

అవును

సందియంలేదు,

అది.. అది..

‘పెద్దనా’ర్యు

ప్రబంధ శిల్పమది!

కలిత లలిత

కవితయైన

కావ్య స్థగితమది!!

ఎద దోచిన

‘వరూధినీ’ సౌందర్యమది!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!