వయ్యారాల జాబిలమ్మ
రచయిత: లంకా జయకుమారి
అంశం :: వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..
నా ప్రాణానికి కొత్త రంగులు అద్దిన రూపానివా..
కనురెప్పల ముంగిటిలో కొలువైన ప్రియసఖుడివా..
నన్ను రెప్పపాటు కూడా వదలని తియ్యని మైమరుపువా..
నా అడుగులు ఎటు సాగినా ..
నా మనస్సు పరుగులు నీకోసమేనా..
నీ తలపుకే ఇంతలా పరవశించి పోతుందే నా మది..
నీ రాకకై ఎదురు చూసి.. చూసి
అలకబూనిన నీ వయ్యారాల జాబిలమ్మను..
నీ కౌగిట బంధించిన వేళ..
ఉత్తరాన సూరీడు ఉలిక్కిపడెనేమో..