బ్రతుకు వర్ణాలు

బ్రతుకు వర్ణాలు

సుఖ సంతోషాల తరగని సిరుల 

ఆనందాల ‘హరిత’వనం 

బ్రతుకులోన వెల్లివిరిసిననాడు.. 

 

ఉప్పొంగిన ఆహ్లాదపు ‘నీలం’

ఎగసి నింగియంత అలముకున్ననాడు.. 

 

జగమంతటి మంచియంతటిని 

గ్రహించి నింపుకున్న ఙ్ఞానమే 

‘అరుణ’వర్ణపు ఆరని రవిబింబమై

విఙ్ఞాన వీచికలను ప్రసరింపజేసి విశ్వమంతటి

తిమిరాంధకారములను తరిమివేయునాడు.. 

 

సర్వేజనా సుఖినోభవంతు యనుచు,

తోటి వారి శ్రేయస్సును కోరే, నిండు మనసుల

పసిడి శోభలు, పుడమికి అద్దిన 

శుభ సంకేతపు ‘పసుపు’ సోయగాలుగా..

శాంతి సౌభాగ్యాలతో, సౌభ్రాతృత్వములో

ప్రేమానురాగాల సహవాసమును పూనిన

మన్నికైన హృదయాలు, కురిపించు చల్లని

శుభాశీస్సులే,’శ్వేత’వర్ణపు మంచు ముత్యాలుగా 

 

ధరణి పులకించగా…జగతి వర్ధిల్లగా…

విషము కక్కగ పొంచియుండు ఏ నకారాత్మక

శక్తుల..ఆ విధి వక్రపు చూపుల..’నల్లని’ చీకట్ల

పడగ నీడ వాలకుండా…చూడుమురా దేవరా 

 

ఏ ‘హోళిక’నైనా, ‘మాలోని’ దానవుడినైనా 

ఎదిరించి నిలిచి, తుదముట్టించి గెలుచు,

‘స’కార శక్తిని , మనోనిబ్బరమును మాకొసగరా…

                                                                                            రచయిత: సత్య కామఋషి’ఏకలవ్య’

You May Also Like

One thought on “బ్రతుకు వర్ణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!