శునక భోగం

ఏమి రాజభోగమే ఓ శునక రాజమా…
అంతంత బడాయి ఎందుకే మరి నీకు
ఓ కుక్క ముఖమా…!!
ఉప్పులేని చప్పుడు పప్పు కూడు నాకు….
కక్క ముక్కల బోనం నీకు..పెట్టి పుట్టినావే…!!
పుట్టినరోజు కానుకంటూ, ఓ ఉంగరమైనా లేదే నాకు..
మేలిమి కుక్క గొలుసులుగా, మేని మెరుపులేమో నీకు.!
పెళ్లిరోజు నాడైనా, చిరు ముద్దైనా లేదు నాకు
నేను మోజుపడిన, నా చెలియ కౌగిలి వెచ్చదనం నీకు.!
ఇల్లు నాది, ఇంటావిడ నాది, ఇంట రాజభోగమే నీది..
నా కర్మ కాలిపోగా, ఎక్కడ దొరికావే నాకు..!!
అనుకోని అతిధిలా వచ్చి ..నా పక్కలో బల్లెమైనావే..
ఇంటికి కాపలాగా నిన్ను ఏరీ కోరీ తెచ్చుకున్నాను…
నిన్ను కాపలా కాయలేక నిత్యం చస్తున్నానే….!!
నీ భౌభౌ లను వినలేక ..నా గుండె అదురుతాందే..కానీ
నిమిషం వినబడకుంటే…ఆ గుండే గుభేలుమంటోందే.!!
చయిత:సత్య కామఋషి’ ఏకలవ్య ‘

😀😀😀😀