ప్రకృతి వాహిని
నీలి నింగిలో మెరిసే ధ్రువతారలా
పున్నమి కాంతిలో పరిమళించే సన్నజాజిని
సెలయేరు ఒంపుసొంపులతో
హంస నడకల వయ్యారంతో
నెమలిలా నర్తించే ముగ్ద మోహిని
ఆకాశమే హద్దుగా నిలిపే ప్రేమతో
నేల ను నుంచి సహనంతో
చిరుగాలి స్పృశించి హాయి ని మించిన
తల్లిగా చెల్లిగా అక్కగా ఆలిగా అవ్వగా
పంచ బంధంలా జీవ క్రమా ప్రబోధిని. ప్రవాహాన్ని
నలుదిక్కుల ప్రకృతి శోభామయం
అణువణువునా అలంకరించుకున్న
ప్రకృతి వాహిని మానవ సృష్టి ప్రదాయిని
లేలేత గులాబీ రేకుల వర్చస్సుతో
ఏడు వర్ణాల ఇంద్ర దర్శిని…!
రచయిత::గొల్లపల్లి సంజయ్