వారసుడొచ్చాడు
మా ఇంటి శునక మహారాజు వచ్చాడు
చేతులకు కడియలతో..
మెడలో హారాలతో..
బంగారపు టుంగరాలతో..
కట్టలుగా డబ్బులతో..
వారసుడొచ్చాడు..
కొడుకు మీద కోపమొచ్చె..
ఇంట్లోకి కుక్కొచ్చే..
కొత్త వారసుడు రాగానే
కొడుకు నోట్లో మన్ను పడే..
భైరవుడి కన్ను పట్టు పరుపు మీద పడే.
రచయిత:మౌనవీణ