శునకమైనా

శునకమైనా!?

కనకపు సింహాసనము పై
శునకమును కూర్చుండబెట్టిన
అంటే ఇదేనేమో, ఆహా ఏమి దర్జా!
ఎంత హాయి! అన్నీ ఉన్నా కావాల్సిందే లేదు!

నా మెడకు బంగారం కట్టి,
నీ దగ్గర బాటిల్ పెట్టుకుంటావా?
నా చేతికి నోట్లిచ్చి నాక్కావాల్సిన
ఆ ముక్క నీ నోట్లో పెట్టుకుంటావా?

నా వేళ్ళకి బంగారు ఉంగరాలు తొడిగి
చికెన్ ఫింగర్స్ నువ్వు చీక్కుంటావా?
ఇదేమన్నా న్యాయంగా ఉందా నీకు?
ఈ బంగారాలు సింగారాలు
నేనేమి చేసుకోను?

ఆ ముక్కిస్తే బుద్ధిగా మెక్కేసి
చక్కగా ఆవులించి బబ్బుంటా
రాత్రంతా నీ ఇంటికి కాపలా కాస్తా!
దొంగలు దోచుకోకుండా చూస్తా!

ఈ అలంకారాలు నాకొద్దు
నా కడుపునిండా అన్నం పెట్టు చాలు
నీ మేలు ఈ జన్మలో మరవను
నీ కాళ్ళ కింద కుక్కలా పడి ఉంటా

                           రచయిత: పరిమళ కళ్యాణ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!