జీవితానికి ప్రతీక ఉగాది
ఏ దేవుడికీ, దేవతకూ
సంబంధం లేకుండా
మానవజాతికీ కాలానికీ
ప్రతీకగా వున్న అనుబంధాన్ని
తెలియజేసి.. సహనానికి
మనోవికాసాలకు ఆలవాలమై
ఆత్మీయతకు దారిచూపే
పండుగ “ఉగాది” పండుగ.
వసంత ఋతువు ఆరంభం
మనలోనూ
దుర్గుణాలను రాల్చుకొని
సద్గుణాలను చిగురింపజేయడం.
జీవితానికి అర్థంచెప్పే
తీపిచేదు కలయికల
ఉగాది పచ్చళ్ళు
మావి చిగురుతిన్న
కోయిల పాటలు
అభ్యంగన స్నానాలు
విందు భోజనాలు
మేలుకోరే
పంచాంగ శ్రవణాలు
“ఉగాదిలో కలవకపోతే
జగాదిలో కలవరు” అని
బంధువుల కలయికలు
ఉగాది సంబరాలు
రచన: సురేంద్ర రొడ్డ