హోలీ రంగుల ప్రకృతి
భగవంతుని సృష్టిలో
ఎన్నో రంగులు అవి అన్ని
కలిస్తే ఏక వర్ణం తెలుపు
మనకు రంగుల ద్వారా అందం
ప్రకృతి అంత సుందర వర్ణ
సమ్మిళితం అదో రంగుల కళ
కళల ద్వారా కలలు సాకారం
అదంతా ప్రకృతి రంజకం
న్యూటన్ లా ప్రకారం ఈ ప్రకృతిలో
భూమి ఆకాశం
ఆ మధ్యలో రంగురంగుల
చిత్ర సౌందర్యం అద్భుతం
హోలీ రోజు తెల్లని వస్త్రాలు ధరించి
రంగులు చల్లు కోవడం ఒక సంప్రదాయం
అందులో ప్రకృతి సహజ రంగులు
ఉంటే ఆరోగ్యకరం
రచయిత:నారుమంచి వాణిప్రభాకరి