హోలీవర్ణ ఝరి

హోలీవర్ణ ఝరి

పదాలు మాటున దాగిన వర్ణ సౌందర్యమా, 

నిను వర్ణింప అక్షర తరమా!!

 

చల్లని చంద్రమే నిను చూసి ఈర్ష్య పొందునేమో,

సమరమైన అలజడిలో శాంతించవే ఓ మల్లెల “శ్వేతమా”!!

 

బాధను మరిపించే నిశాచరివి, 

రసరమ్యాలాపనకి సహచరివి, 

తిరుగు బాటుకు మైత్రివి “నులివు”కదా!!

 

శుభానికి సూత్రదారివీ పవిత్రతకు రూపానివై, 

మేని ఛాయకు కిట్టుకువు కదా, 

సువర్ణానికి పోటీ ఐనా “హరిద్రమ”!!

 

పైరగాలికి మరు రూపమా, 

కల్యాణానికి కనువిందువు గదా, 

ప్రశాంతతకు ప్రాణమేగా నీవు “హరితమ”!!

 

రౌద్రానికి రాజువు, అగ్నికి రూపివి నీవు, 

మానవ జన్మకు మూలానికి దారివి నీవు “తామ్రమా”!!

 

సాగరానికి స్నేహితవై, నింగికి నిండుగా దుప్పటిగా మారి

అలలా ఎగిసిపడే “సౌరి రత్నమే”నీవు!!

 

దేహముపై ధరించిన నీ చిరుస్పర్శతో, 

మేనిఛాయ విద్యుత్ అయి వికసించిన

ప్రకాశానికి మరురూపమా “శబ్దరత్న కరమా”!!

 

మనిషి గుణగణాలను తెలిపే “వర్ణములన్నీ” 

ఒక చోట చేరితే హోయలొలికించే “మయూరనాట్యం”

కదా ఈ హోలీ మహోత్సవం!!!

                                                                    రచయిత:దీప్తి

You May Also Like

2 thoughts on “హోలీవర్ణ ఝరి

  1. మీరు వర్ణముల(రంగులు) గురించి వర్ణించిన తీరు
    అక్షర మాధుర్యంతో కూడిన పదబంధాల శైలి
    అద్భుతం
    తెలుగు భాషా విశిష్టతను మీ కవన సౌందర్యంలో వీక్షించి
    కొన్ని పదాలకు అర్థాల కోసం శబ్దరత్నాకర గ్రంథ స్పర్శను అనుభవించి పదకోశం పెంచుకునేలా చేసిన మీ కవిత చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!