నా హీరో మా నాన్న
రచయిత:మౌనవీణ
తప్పటడుగులు వేసేటప్పుడు చేయందుకున్న నాన్న..
నా తప్పులను ప్రేమగా సరిదిద్దేను నాన్న..
దూరం ఎరుగని గమ్యంలో తోడుండేను నాన్న..
చీకటి తోవలో వెలుగుగా నిలిచేను నాన్న..
భయంతో ఆగిపోతే భుజం తట్టి నదిపించేను నాన్న..
ఏమడిగినా క్షణంలో తెచ్చిచ్చే నాన్న..
నా కోసం ఎన్నో ఎదురు దెబ్బలోర్చేను నాన్న..
నేను మాత్రమే చూసే నా హీరో నాన్న..
నా పెదవుల మీద విరబూసే చిరునవ్వుకు కారణం నాన్న..
నేను చూస్తున్న నిజం నాన్న..
మా నాన్న మనసు వెన్న…!