దారి చూపే వెలుగు నాన్న

దారి చూపే వెలుగు నాన్న

 

రచయిత:చెలిమేడా ప్రశాంతి


తేనెలొలికే ముత్యాల మాటలు నేర్పి
చిట్టి చిట్టి పాదాలు కందకుండా ఎదపై అరచేతిలో ఆడించే
ఏ నిమిషం విడువని కష్టాన్ని నా దాకా రానీయని
నా హీరో నాన్న..

నోరు తెరిచి అడిగేలోపే ఇష్టమైనవి
అందించే నేస్తం నాన్న
చిన్ని చిన్ని అల్లరికే అమితంగా మురిసిపోయే
ఆత్మ బంధువు నాన్న 

నన్ను ముందు ఉండి నడిపించే..ప్రేమ..నాన్న
జీవితం అనే పోరాటంలో అలుపెరుగని మనిషి బాధ్యతలు అనే 
బండిని మోస్తూ మనల్ని మనతో నడిపించే ఒకే ఒక నేస్తం కన్నతండ్రి మాత్రమే…. 

నువ్వు అవమానించిన పట్టించుకోకుండా
నీ బాధ్యతలు నువ్వు నేర్చుకునేలా
తీర్చిదిద్దడంలో అలసిపోని గురువు..నాన్న 

అమ్మ ప్రాణం పోస్తే…
నీకు ఈ లోకాన్ని పరిచయం చేసే 
మొదటి వ్యక్తి నాన్న.. 

తన గుండెలపై తంతున్నా 
నిన్ను గుండెలలో దాచుకొనే
ప్రాణస్నేహితుడు నాన్న మాత్రమే…
తనని తను కోల్పోయినా నిన్ను గెలిపించే నాయకుడు నాన్న

మన తడబడే అడుగులను సరి చేస్తూ పడిపోకుండా 
తన  చేతులను అందిస్తున్నాడు నువ్వేంటో నువ్వే తెలుసుకునే
ప్రయత్నం చేసేలా నీలో ఉత్సాహాన్ని నింపుతాడు… 

ప్రతి కష్టం లో వెన్నంటి ఉంటూ ముందుకు నడిపిస్తున్నాడు
మా బాధలు కూడా నువ్వే భరిస్తూ…..
నవ్వుతూ మాకు ఆనందాలను పంచుతావు… 

మా కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని మాలో ధైర్యాన్ని నింపుతావు….. 
మాకు జీవిత పాఠాలు నేర్చుకోవడంలో…
నువ్వే మొదటి గురువు అయ్యావు…. 

తెలిసీ తెలియక మేము చేసే తప్పులను…
సరిదిద్దుతూ మా కోసం నిన్ను నువ్వే మర్చిపోతున్నావు…
అమ్మ మమ్మల్ని ప్రపంచం లోకి తీసుకు వచ్చే మొదటి దేవత అయితే…….

ప్రపంచాన్ని పరిచయం చేసే మొదటి గురువు మీరే నాన్న ..
నిరంతరం మీరు ఓడిపోతూ మమ్మల్నిగెలిపిస్తూ ఉన్న మీ ప్రేమకు మేము దాసోహం..
కష్టాల కడలిని ఎదుర్కొనే ధైర్యం మాకు ఇచ్చావు
బ్రతుకుతో పోరాడే శక్తి యుక్తులను మాకు దార పోసావు

ప్రతి ప్రయత్నానికి మాలో ఆశాజ్యోతుని వెలిగిస్తూ
నిరంతరం శ్రమ ఎరుగని శ్రామికుడిగా శ్రమిస్తున్న నాన్న
మీకు ప్రేమతో నా హృదయాంజలి..
ప్రపంచాన్ని ఎదిరించి నీ బాధలు తీరుస్తూ నిన్ను 
బాధ్యతగా  ప్రేమించగలిగే ఒకే ఒక వ్యక్తి
నాన్న మాత్రమే…. 

You May Also Like

One thought on “దారి చూపే వెలుగు నాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!