నాన్నకు ప్రేమతో -మీ కుమార్తె
రచయిత:సావిత్రి తోట “జాహ్నవి”
నాన్నా!…అమ్మ చెప్పిన నమ్మకం…
అమ్మలా ముద్దు మురిపాలు పంచాలని ఉన్న…
తన గారాబం బిడ్డ అభివృద్ధి కి ఎక్కడ ప్రతిబంధకం
అవుతుందోనన్న భయం…
ముద్దులన్ని దూరం చేస్తున్న…
బాధ్యతలనే తన ప్రేమ గుర్తులుగా అందించే నాన్నా!…
బాధ్యతంటూ ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తూ
తన కంట కన్నీళ్లు కనపడితే…
ఎక్కడ బేలనవుతానో అంటూ…
చాటు మాటుగా కండువా తో కళ్లు వత్తుకున్న నాన్నా…
నాకు కష్టం వచ్చిందనగానే…
అన్ని చోట్ల పరిష్కార మార్గాలు వెతుకుతూ…
కష్టాల నుండి గట్టున చేర్చే నాన్నా …
నాన్నా! నీకు వందనం…!