ఏంటో ఈ పెద్దవాళ్లు!!!
అయ్యబాబోయ్
ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటే మాత్రం
ఊపిరి కూడా సలపనీకుండా
ఇన్ని ముద్దుల్లో ముంచెత్తేస్తారా…!!!
ఏదో ఓ ముద్దు
అదీ అందంగా ఉన్న పక్కింటి ఆంటీ పెడితే
చక్కిలిగిలి అనిపించి నవ్వావంతే
అదే నా తప్పబ్బా…!!!
ఆవిడ ముద్దులు పెట్టడం ఆపనే లేదు
ఎంత ముద్దొస్తున్నాడో
చూడండీ ముద్దు పెడుతుంటే
ఎలా నవ్వుతున్నాడో అంటూ
పదే పదే పెట్టేసి
నా ఒంటిని ముద్దుల మయం చేసింది…!!!
అదే ఈ ముద్దులు
నేను పెద్దయ్యాక పెట్టమంటే
మూతిపై వాతలు పెడతారట…!!!
ఏంటో ఈ పెద్దవాళ్లు
అడిగినప్పుడు ఇవ్వరు
అడగనప్పుడు మాత్రం పదే పదే ఇచ్చేస్తారు…!!!
రచన: కమల శ్రీ