నువ్వులేక నేనులేను

(అంశం : నా అల్లరి నేస్తం) 

నువ్వులేక నేనులేను

రచన ::దోసపాటి వెంకటరామచంద్రరావు

అయినవారందరూ కాదని వదిలేస్తే
ఆశనిరాశలమధ్య ఊగిసలాడుతూ
ఏం చేయాలో తెలియక
దిక్కుతోచని స్థితిలో
ఆశలు అడియాసలై
ఆసరాలేక
అనుభవంలేక
చేతిలో చివ్నగవ్వకూడాలేక
ఆకలితో అలమటిస్తూ
నిద్రలేక ఎన్నోరాత్రులు
ఒంటరిగా గడుపుతూ
ఆత్మస్థైర్యం చాలక
ఆత్మహత్యచేసుకుందామని
ఆరోజు నిశ్శబ్ధనిశిలో
సముద్రంలోదూకితే
ఎక్కడనుంచో ఆపన్నహస్తం అందించారెవరో
అది నువ్వేనని తెలుసు
అప్పటినుండి నువ్వేనేనుగా
జీవిస్తూ వస్తున్నాం
అందుకే నువ్వులేక నేనులేను
నువ్వే నా అల్లరి నేస్తానివి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!