చతుర్విధ ప్రక్రియల గేయం

చతుర్విధ ప్రక్రియల గేయం

రచయిత :: మీసాల చిన గౌరినాయుడు

అంకెలమండీ అంకెలం
చిక్కులు విప్పే అంకెలం
లెక్కలు చెప్పే అంకెలం
యుక్తిని గొలిపే అంకెలం….

అంకెలలోని లింకులన్నీ
శంకలు లేక తెలిపెదమండీ
గణితంలోని ప్రక్రియలన్నీ
గమ్మత్తుగా చేసేదమండీ..

(ప్లస్)

” + “గుర్తుతో బంధనమండీ
అంకెకుఅంకె కలపడమండీ
కూడిక ఫలితంమొత్తమండీ
సంకలనమని అంటారండీ.

(మైనస్)

” ౼” గుర్తు మధ్యన ఉంటే
తీసివేయుట చేయాలండీ
దీని ఫలితమే బేధమండీ వ్యవకలనమనిఅంటారండీ
(ఇంటు)

గుణ్యము,గుణకము”×”తో
లబ్ధమునే సాధించెదమండీ
గుణకారమనిపిలిచెదరండీ
హెచ్చువేతని అంటారండీ..

(÷)

భాగహారమే నా పేరండీ
భాగాలను చేయుదునండీ
కష్టం కష్టం అంటారండీ
ఇష్టంఉంటే వశమగునండీ.
******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!