భాషల భావాల బొమ్మ భావాలు

భాషల భావాల బొమ్మ భావాలు

రచయిత :: జ్యోతిశ్రీ

“నీ వల్లే అంత, నీ వల్లే నాకు ఈ గతి పట్టింది” అని ఘొల్లున ఏడుస్తూ చీర కొంగుకి ముక్కు చీదుకుంది ఆమె, “నిన్ను క్రై చేయించిన పాపం నన్ను ఊరికినే వదల్లేదు సిస్టర్ నేను నాశనైమైపోయాను. వీళ్ళు నన్ను కూడా వదల్లేదు” అంటూ చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
అక్క మనతో పాటు ఏడుస్తుంది చూడు ఇంకోకామే, అని ఆమె దగ్గరకు వెళ్లి “నీ బాధేంది సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నావు” అని అడిగింది. దాంతో ఆమే బాధగా మోహం పెట్టింది.
“ఓ…నువ్వా నీ వల్లే కదా మేము నాశనమైపోయింది.” అంటూ ఇద్దరు కలిసి శోకండాలు పెడుతుంటే తాను ఏడుస్తూ మొహం పెట్టింది. “నీకేం మాయదారి రోగం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు.” అనగానే పక్కకు చూడమన్నట్టు సైగ చెయ్యడంతో అటు చూసి ఇద్దరు షాక్ తో నోరెళ్ళబెట్టారు.

కాసేపటికి ముగ్గురు తేరుకుని అక్క నీ బాధేంటో చెప్పరాదు అంది. రెండవామే…, ఔను అన్నట్టు కళ్ళు ఆర్పింది మూడవామే
**
“నా పేరు తెలుగుతల్లి ఇదిగో ఈ ఆంగ్లమాత వచ్చాక నన్ను పట్టించుకోవడం మానేసారు. ఈ జనాలు నన్ను మర్చిపోయారు కూడా ఈతరం పిల్లలకైతే నేను తెలియదు. ఆంగ్లంలో చెబితేనే అర్థమవుతుంది.” అంటూ బాధపడి, “ఇప్పుడు చెప్పు నీ భాదేంటో?” చెంగు దులిపి అటుతిరిగి నుంచుంది తెలుగుతల్లి…
“మై నేమ్ ఈజ్ ఇంగ్లీష్ మమ్మీ” అంది స్టైల్ గా చున్నీ ఎగరేస్తూ…
“తెలుగులో చెప్పవే నువ్వైనా” అని బ్రతిమాలింది తెలుగు తల్లి
“కష్టం సిస్టర్ సర్లే వాళ్ళ సౌలభ్యం. నా దౌర్భాగ్యం, తెంగ్లీష్ లో చెప్తాలే అని నిన్ను మర్చిపోయారక్క నన్నైతే మార్చేస్తున్నారు ok అనడానికి k అంటా..! thank you అనడానికి tq అంటా ముక్కు ఎగబిల్చింది. నన్ను ఎవరికి వారే వాళ్ళ భాషాలో కలిపేసుకుంటున్నారు. పోన్లే rip పెట్టకుండా live లో ఉన్నానని స్మైలింగ్ చేస్తుంటే లాంగ్వేజ్ తో పనిలేని ఈ బొమ్మ వచ్చి నాకు ఎసరెట్టింది సిస్టరో సిస్టర్” అని క్రై చెయ్యసాగింది.
“అబ్బ చూడడానికి స్టైల్ గా చీ,చీ ఆధునికంగా ఉన్నావు కానీ పక్క మాస్ లా ఉన్నావు” అంది. తెలుగు తల్లి…
“థ్యాంక్స్ సిస్టర్” అని పళ్ళికలిస్తూ ఒక స్మైలి 😁ఎమోజీ పెట్టింది, ఇంగ్లీష్ మమ్మీ.
“అవును మనిద్దరం ఏడ్వడం బాగానే ఉంది. మాటలు లేని ఈ ‘భావలబొమ్మ’ ఎందుకు ఏడుస్తుంది.” అని అడిగింది తెలుగు తల్లి…, “సిస్టర్ దాని పేరు ఎమోజీ” అని మళ్ళీ పళ్ళు బయట 😁 పెట్టింది ఇంగ్లీష్ మమ్మీ…
“ఏదోకటి దాని బాధేంటో చెప్పమను అంది తెలుగు తల్లీ..”

👤😭👤🤷👥🙏🙎🧘👍 ☝️👉👀😏అని చెప్పాయి ఎమోజిస్
ఒక్కముక్క అర్థం కాలేదు. అని ఇద్దరు కలిసి 🙆 నెత్తి మీద చేతులు పెట్టుకున్నారు.
ఇద్దరు కలిసి ప్రయత్నించసాగారు ఆ భావాల బొమ్మ భావాలు 👤నా 😭 ఏడుపెంటో 👤 నాకు 🤷 తెలియదు.👥 మీకు 🙏దండం పెడతా 🙎 నన్ను 🧘 ప్రశాంతంగా 👍 ఉండనివ్వండి. ☝️ ఒకసారి 👉 పక్కకు👀 చూడండి 😏 మూతి తిప్పుకుంది ఎమోజి.
“బాబోయ్ చాలా కష్టం సిస్టర్” ఈ ఎమోజీ లాంగ్వేజ్ అనుకుని “ఔను ఇదంతా నిజమేనా మనం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో” అంది తెలుగు తల్లి.
“వాడంతే సిస్టర్ అర్థమైనోళ్ళకు అర్థమైనంత” అని ఇంతకీ పక్కకెందుకు చూడమంది చెప్మా ఉప్మా🤔 అనుకుని పక్కకు చూసాయి. అక్కడ వివిధ రకాల తెలుగు మీమ్స్, ఇంగ్లీష్ స్టీక్కర్స్ ఉన్నాయి.
అవి చూడగానే పోన్లే మన భాష ఈ రకంగానైనా బ్రతికే ఉంది అని ఒకరి 👀 ఒకరు తుడుచుకుని ఆనందంతో స్మైలింగ్ చెయ్యసాగారు.

***

 

You May Also Like

10 thoughts on “భాషల భావాల బొమ్మ భావాలు

  1. సూపర్ 👌👌 తెలుగు 🧑‍🍼 English 🤱 కథ👌👌

    1. థ్యాంక్యూ కార్తీక్ గారు 😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!