ఓ తండ్రి కథ

ఓ తండ్రి కథ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు పత్రిక – మనోహరి)

రచన: సుజాత కోకిల

“కృష్ణ సూర్యుడు ఉదయించక ముందే లేస్తుంది. తన దినచర్యలో భాగంగా తన పనులన్నీ తనే చక చక చేసుకుపోతుంది. కృష్ణకు తండ్రి అంటే. చాలా ఇష్టం! తండ్రికి కూడా కృష్ణ అంటే వల్లమాలిన ప్రేమ తన తండ్రి లేవకముందే తనకు పేస్టు బ్రష్ దగ్గర నుండి స్నానానికి కావలసిన వేడి నీళ్లు దగ్గర నుండి అన్ని తానే చూసుకుంటుంది.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం చేత తండ్రికి మడి ఆచారం ఎక్కువనే చెప్పాలి. రోజు ఉదయాన్నే పూజకు కావలసిన పూలు, పండ్లు ఇంకా సంధ్యావందనానికి కావలసిన ఉద్దరిని, అష్టదలి పంచ పాత్ర తలలాడేలా చింతపండుతో కడిగి శుభ్రంగా పూజా గదిలో ఉంచుతుంది.
స్నానం చేసిన తర్వాత అప్పుడు తన తండ్రి దావోలి కట్టుకొని ఆ పూజా గదిలో రెండు గంటల పాటు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. తన పూజా కార్యక్రమం అయ్యేదాక పచ్చి గంగ కూడా ముట్టుకోరు. రోజు ఇది తన దినచర్య! భోజనం చేయడము మధ్యాహ్నం రెండుగంటలు అవ్వందే. భోజనం చేసేవారు కాదు.
కృష్ణ ఇలా రోజు చేసుకుంటూ పోతుంటుంది. కృష్ణకి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటూ ఏదో డిగ్రీ చదివామని అనిపించారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.” తమ్ముడు జ్యోతిష్యం చెప్తాడు మిగతావి ఎవరు ఏమి పట్టించుకోరు కృష్ణకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇంటర్ తో ఆపేసింది. ఇంటి పనులన్నీ తనే చూస్తుంది.
కాలచక్రం ఎవరికోసం ఆగదు అలా గడిచిపోయింది. పెద్దక్కకు పెళ్లి అయిపోయింది. కానీ ఇల్లరికం అల్లుడిలా ఇద్దరు అమ్మ, నాన్న దగ్గరే ఉంటారు. బావకు జాబు లేకపోవడంతో శర్మ గారికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడే ఉండి పెత్తనం చేయడం అన్నిటిలో తల దూర్చడం నాన రభస చేస్తుండేది.
నాన్న చాలా బాధపడేవారు ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత అత్తవారింట్లో ఉండక తల్లి గారి ఇంట్లో ఉంటే నాన్నకు చాలా అవమానంగా ఉండేది.
ఇంకా మిగతా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ‘పెళ్లయిన పిల్ల ఇంట్లో ఉంటే వీరికి సంబంధాలు ఎలా వస్తాయని బాధపడేవారు. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అడిగిన వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు తనకు’ ఉద్యోగం చేయాలని ఆలోచన కానీ, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే బాధ కానీ వాళ్ళిద్దరికీ ఉండేది కాదు. అమ్మ పెట్టింది తినుకుంటూ ఉండేవారు. అక్క ప్రైవేట్ జాబ్ చేసేది అక్కకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ ఆలనా పాలన కూడా నాన్న మీదనే పడింది.
పెద్ద పిల్లను కృష్ణనే చూసుకునేది. అయినా ఏమాత్రం విశ్వాసం లేదు చెల్లి చేసిందనే కృతజ్ఞతా భావం ఉండేది కాదు. నాన్న బాధపడుతూ మీద పడ్డ పాము కరువక మానుతుందా! అన్నట్టు నాన్న బాధను దిగమింగుకుంటూ అలాగే భరించే వారు పల్లెెత్తు మాట కూడా అనేవారు కాదు.నాన్న మాట కాదనలేక మేం కూడా నోరు మూసుకొని అలాగే ఉండేవాళ్లం. అక్కకు మాట దూకుడు తనం, తొందరపాటు ఎక్కువనే వెనుక ముందు చూడకుండా మాటలు అనేది అందరు అలాగే భరించే వాళ్ళు, అలా చూస్తుండగానే రెండో అక్కకు కూడ పెళ్లయి అత్తవారింటికి పోయింది.
రెండో కూతురు పెళ్లి అయినప్పటి నుండి ఎక్కువగా తల్లి గారి ఇంటికి తిరిగి చూసేదే కాదు ఇంట్లో కృష్ణ ఒకతే మిగిలిపోయింది. ఇంట్లో పుట్టెడు చాకిరి చేసేది అందరితో ప్రేమగా అందరితో కలివిడిగా ఉండేది. ఇద్దరు అక్కల పెళ్లి పనులన్నీ తనే దగ్గర ఉండి చేసింది. తండ్రికి కుడి భుజంలా ఉండేది అక్క పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. పుట్టెడు చాకిరి చేసేది కృష్ణ. “ఒకరోజు కూడా రెస్ట్ గా ఉండావంటూ తండ్రి మందలించేవాడు”.
అన్నిటికీ సమాధానంగా నవ్వుతూ ఉండేది. ఇకపోతే తమ్ముడు మూడి మనిషి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికీ తెలియదు. శర్మగారు కొడుకు గురించి బాధపడేవారు. చెప్తే వినేరకం కాదు! పెళ్లి గురించి చెప్తే వినేవాడు కాదు. నాకు పెళ్లి వద్దంటూ చెప్పేవాడు. శర్మ గారు బాధతో కొడుకు గురించి పట్టించుకోవడం మానేశారు.
అన్నిటిలో వేలు పెట్టే పెద్ద కూతురు అందరితో నిర్లక్ష్యంగా మాట్లాడడం, కృష్ణ నైతే ఓర్చేదే కాదు ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేది. కృష్ణ అక్కను అనాలంటే ఓ లెక్క కాదు.. అక్క మీద ఉన్న ప్రేమ వయసుకు ఇచ్చిన విలువ కుటుంబంపై ప్రేమాభిమానాలు ఎక్కువ కృష్ణకు! “అక్కకు చిన్నప్పటి నుండే పడేది కాదు. అప్పటినుండే డబ్బు దాహం స్వార్థం ఉండేది. తన సంపాదన ఎవరికి ఇచ్చేది కాదు తనే దాచుకునేది. శర్మగారు పెద్ద కూతుర్ని పట్టించుకునే వారు కాదు అందరికీ తగాదాలు పెట్టిస్తుండేది.
పది సంవత్సరాలుగా పెద్ద కూతురుతో మాట్లాడేవారు కాదు, కృష్ణ బంధాలకి ఎక్కువ విలువ ఇస్తుండేది. పెద్ద కూతురు తన నాటకారి తనంతో మనుషులను ఇట్టే మార్చేస్తుంది. అన్ని చూస్తూ భరిస్తూ ఏమి అనేవారు కాదు కృష్ణ. ఇవన్నీ పట్టించుకోను కూడా పట్టించుకోదు.
కృష్ణ పెళ్లి చేసుకోనంటే చేసుకోనంది తండ్రి మాటను కాదనలేక పెళ్లి చేసుకుంది. ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోక తప్పదు కృష్ణకు పెళ్లి కావడంతో తండ్రి చాలా బాధపడ్డాడు. కృష్ణ అత్తవారింటికి వెళ్ళింది. అప్పుడు శర్మ గారికి కృష్ణలేని లోటు కనబడేది అదే అదునగా చూసుకొని పెద్ద కూతురు తల్లిదండ్రులను మాటలతో హింసించేది. శర్మగారు, శర్మ గారి భార్య చాలా కృంగిపోయారు. కృష్ణ పెళ్లయి అత్తవారింటికి పోయినాక పెత్తనమంతా తనే చేసేది ఆ బాధతో శర్మగారు కృంగిపోయారు.
కృష్ణ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన ఓరిచేది కాదు. కృష్ణ అభిమానం గల పిల్ల ఎప్పుడు వచ్చిన ఏదో ఒక సూటి పోటి మాటలతో రాకుండా  చేసింది. అవన్నీ విని విననట్టుగానే ఊరుకుండేది ఏ విషయం శర్మ గారికి చెప్పేది కాదు! శర్మ గారికి చెప్తే ఎక్కడ బాధపడతారనే ఏమి చెప్పేది కాదు. శర్మ గారి కొడుకు వచ్చాడు. కొడుకుని చూడగానే చాలా సంతోషం వేసింది శర్మ గారికి తల్లితండ్రులను కంటికి రెప్పలా కాపాడు కుంటూ ఉన్నాడు. ఇప్పుడు శర్మ గారికి మనసు ప్రశాంతంగా ఉంది. తన కొడుకు దగ్గర ఉన్నాడనే ఆ సంతోషం ఎక్కువగా సంతోషించకుండానే శర్మగారు స్వర్గస్తులయ్యారు.
శర్మగారి భార్య భర్త వియోగాన్ని భరించలేక తొందరగానే శర్మ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇన్నిరోజులు ఇల్లు పట్టుకోకుండా గాలికి తిరిగిన కొడుకు తల్లిదండ్రులకు దగ్గరుండి అన్ని విధాల కర్మకాండలు జరిపించాడు. చాల ఖర్చు పెట్టి చేస్తున్నాడనే కోపం ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాడనే బాధ పెద్ద కూతురులో మొదలైంది.
శర్మ గారి కొడుకును కూడా మూడు చెరువుల నీళ్లు తాగించింది. శర్మ గారు ఆస్తులను నలుగురికి సమానంగా ఇచ్చారు. పెద్ద కూతురు ఆస్తి అంతా తనకు దక్కలేదనే ఉక్రోషంతో ఊరిలో ఉండకుండా చేసింది. తమ్ముడు ఏమి చేసేది లేక ఆస్తులను అమ్ముకుని వెళ్లిపోయాడు.
శర్మ గారి పెద్ద కూతురికి ఎంత చేయాలో అంత చేశాడు. ఇంకా కూతురికి పెళ్లి కూడ ఘనంగా చేశాడు. ఏ మాత్రం విశ్వాసం కృతజ్ఞతా భావం లేని మనిషి అలా చేయడంతో మానసికంగా కృంగిపోయాడు. బంధాలకు దూరమయ్యాడు. తన భార్య కూడా మోసం చేసింది. కృష్ణను కూడా ఇబ్బంది పెట్టాలని చూసింది కానీ తను చాల స్ట్రాంగ్ గా ఉండడంతో తనని లెక్కచేయకుండా తనది తాను నిలదొక్కుకుంది. కృష్ణ దగ్గర తన పప్పులేమి ఉడికేవి కావు తన బాగోతం అంతా కృష్ణకు తెలియడంతో కృష్ణను టార్గెట్ చేసింది. ఉన్నవి లేనివి కృష్ణ గురించి రెండో చెల్లెలుకూ చెప్పేది. తనని దూరం చేసింది. ఇలా కట్టు కథ చాలా బాగా అల్లుతుంది.
ఆలోచన లేకుండానే ఎదుటివారు నమ్మేస్తారు.
50 సంవత్సరాల నుండి రాజ భోగాలతో పూజ పునస్కారాలతో నిండిన ఆఇల్లు  కూడా ముక్కలు చేసింది. ఇంటికి దీపం లేకుండా స్మశానంలా మార్చింది.
ఎవరితోనూ సరిగా ఉండదు. ఇరుగుపొరుగువారితో కూడా ఎప్పుడు గొడవలే ముందర అనలేక చాటుకు ఎన్నో అంటుంటారు. ఆ తమ్ముడు కూడా మానసికంగా కృంగిపోయి సూసైడ్ చేసుకున్నాడు. తమ్ముడు ఆస్తిని కూడా తనే మింగింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా! భూమిపై మనకు కూడా ఎప్పుడో ఒకరోజు వస్తుంది. ఆ బాధపడ్డ మనసులు కలకలలాడిన బాధ మనకు కలిగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది. ఆ బాధ ఏంటో? మనం కూడా అంతే బాధపడాల్సి వస్తుందని తెలుసుకోవాలి! డబ్బు దేముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. బంధుత్వాలు బంధాలు చెడిపోతే మళ్ళీ కలుపుకోవటం చాలా కష్టం ఒకరిని కష్టపెట్టి తీసుకున్న సొమ్ము ఎక్కువ కాలం నిలువదని గుర్తించాలి. కృష్ణ మాత్రం అలాంటి బంధాలు వద్దనుకుని వాళ్లకి దూరంగా ప్రశాంతంగా ఉంది.
ప్రేమలు, ఆప్యాయతలతో నిండిన ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ సుఖసంతోషాలతో ఉంటుంది. అదే ప్రతి మనిషికి కావలసింది. డబ్బుతో ముడి పెట్టుకోకండి బంధాలు చాలా విలువైనవి మళ్లీ బంధాలకు చేరువ కావాలనుకున్నప్పుడు మళ్ళీ చేరలేము మనం మన తల్లిదండ్రులకు ఏమి ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ ప్రశాంతతను మాత్రం దూరం చేయకండి!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!