పండుగ వెళాయెరా..!! (సంక్రాంతి కథల పోటీ)

పండుగ వెళాయెరా..!!
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: విస్సాప్రగడ పద్మావతి

సత్తీ.. సత్తి.. ఒరేయ్ సత్తి.. ఎక్కడ చచ్చావురా.. వీడొకడు.. వట్టి అయోమయం.. ఉలకడు పలకడు.. లక్ష్మీ.. సత్తి గాడు ఎక్కడా.. పొద్దున్ననగా ఇల్లు దులపమన్నా.. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో…ఓసారి పెరట్లో చూసిరా.. ఎక్కడున్నాడో…అని రాజత్త అంటుంటే అమ్మ గారు నేను వెళ్లి చూసి వస్తాను అంటూ తోముతున్న ఇత్తడి గిన్నెలు పక్కన పెట్టి చేతులు కడుక్కుని వెళుతుంది లక్ష్మి.
దూరంగా సంక్రాంతి వచ్చింది తుమ్మెద అంటూ కూని రాగం వినపడుతుంటే అటువైపుగా వెళ్ళింది లక్ష్మి.. అక్కడ ఉన్న గడ్డి పీకుతూ కనిపిస్తాడు సత్తి. సత్తి అమ్మగారు పిలుస్తుంటే వినపడట్లేద? ఇందాకట్నుoచి నీ గురించి వెతుకుతున్నారు.. ఆ పనాపి అమ్మ గారిని కలిసి రా అంది లక్ష్మి. అవునా నాకేం వినపడలేదే.. సరే ఇప్పుడే వెళ్తా.. అంటూ సత్తి లేచి గబ గబ వెళ్తాడు అమ్మగారైన రాజత్తను కలవడానికి…
అమ్మగోరు అమ్మగోరు పిలిసెరాండీ.. లేదురా అరిచాను..ఎక్కడ తగల్లడ్డావురా.. ఇంత సేపూ… అదీ..అదీ.. అమ్మగోరూ.. పెరట్లో గడ్డి పీకుతున్నానం డే..ఒరేయి నీకేం చెప్పేను.. నువ్వేం చేస్తున్నావు.. పండుగ దినాలు దగ్గర పడుతున్నాయి.. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.. అవతల పిల్లలు వచ్చే రోజు దగ్గర పడుతోంది.. నువ్విలా బద్దకిస్తూ పని చేస్తే ఎప్పటికీ అవుతాయిరా.. ముందు ఇల్లంతా దులిపిరా .. వెళ్ళు. కదులు.. అలాగే అలాగే అమ్మోగొరూ… ఎళ్తున్నా.. గబ గబ అన్ని గదులు దులిపి శుభ్రం చేసేసాడు.. లక్ష్మి ఇత్తడి గిన్నెలు తళ తళ తళా మెరిసేలా ఉప్పు, చింతపండు వేసి తోమి బోర్లించింది.
రాజేశ్వరి.. ఊరిలో ధన వంతురాలు . చేతనైన సహాయం చేస్తూ…అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఊర్లో అందరూ ముద్దుగా రాజత్తా అని పిలుస్తారు. ఆవిడకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి.. వివిధ దేశాల్లో స్థిర పడ్డారు. ప్రతి సంక్రాంతి కి విధిగా అమ్మనూ.. తల్లిలాంటి ఊరునూ చూడ్డానికి వస్తారు. వాళ్ళు వస్తున్నామని చెప్తే చాలు.. రాజత్త ఇంట్లో సంక్రాంతి కళ వచ్చేస్తుంది..
పిల్లలకోసం సున్నుండలు, చెక్కలు, జంతికలు, గులాబీ గుత్తులు, చేగోడీలు, లడ్లు అన్నీ చేయించి డబ్బాలలో సద్దించి చుట్టూ లక్ష్మణ రేఖ గీయించింది.
అన్న ప్రకారం పండుగకు ఒక రోజు ముందే పిల్లలు మనుమలు, మనుమరాల్లుతో వచ్చారు…
మనవ రాలి చేత ఊరంతా పేరంటం పిలిపించి అటుకులు, వడపప్పు పానకాలతో గొబ్బిల్లు పెట్టించింది.. తులసి కోటకు పసుపు, గంధం వ్రాసి, కుంకుమ బొట్లుపెట్టి, దేవుణ్ణి పెట్టీ.. ఆవు పేడతో నాలుగు గొబ్బెమ్మలు పెట్టి వాటిపై బంతి పూలు పెట్టించి, దగ్గరుండి పూజ చేయించింది. పిల్లలూ.. తులసికోట చుట్టూ తిరుగుతూ గొబ్బిల్ల పాట పాడండి.. నాతో పాటూ అంటూ పాట ఇలా మొదలు పెట్టింది
గోబ్బీఎల్లో గోబ్భీఎల్లో
దుక్కు దుక్కు దున్నారట
ఏమి దుక్కు దున్నారట రాజా వారి తోటలో
జామా దుక్కులు దున్నారటా
అవునాటా అక్కల్లారా చంద్రగిరి భామల్లార
భామల గిరి గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో
ఆహా… చిన్నపిల్లల్లో చిన్న పిల్లలా మారి ఎంత అద్భుతంగా మా రాజత్త పాడుతోంది చుట్టూ జనం మురిసిపోయారు. పప్పు బెల్లం నైవేద్యం పెట్టీ ఇంద పిల్లలు, పెద్దలూ ప్రసాదం తీసుకోండి.. రేపటికి భోగిమంటలు రెఢీ చేయాలి పదండి ఆ పనుల్లో ఉందాం.. అలాగే అమ్మగోరు చేత్తా కంగారు పెట్టకండి.. చేసేద్దాం అంటూ సత్తి పెరట్లో ఉన్న చెక్క ముక్కలన్నీ తీసుకొచ్చి భోగిమంట రెఢీ చేశాడు. భోగి దండలు కూడా సిద్ధం చేసి అన్నీ సిద్ధం అమ్మగోరు అని చేతులు కట్టుకు నుంచున్నాడు.
బామ్మ బామ్మ భోగి దండలు భోగి మంట అంటే ఏంటి? మనవరాలు సుష్మ ప్రశ్నించింది రాజత్తను .
దక్షిణాయణంలో మనం పడిన కష్టాలను, బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ.. ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగిమంటలు. యాంటీబయాటిక్ గా పని చేసే ఆవు పేడతో పిడకలు చేసి దండలుగా కట్టి చిన్న పిల్లలతో వేయిస్తారు. ఓహో అలాగా.. అయితే నేనూ వేస్తా నానమ్మ… అలాగేరా.. మీరందరి చేత వేయించాలనే మీ అందరి కోసం నేను భోగి దండలు సిద్ధం చేయించాను. పొద్దున్నే లేచి నలుగు పెట్టుకుని, తలంటు పోసుకుని, వేద్దురు గాని. తీయ్యనిబెల్లం పాయసం చేస్తాను వచ్చి తిందురుగాని.. సరేనా పిల్లలు.. అలాగే నాయనమ్మ నువ్వు ఎలా అంటే అలా. సరే పిల్లలు అందరూ పెందరాళే పడుకోండి పొద్దున్నే లేవాలి కదా సరే నాయనమ్మ పడుకుందాం పదండి పదండి..
తెల్లవారుజామున మూడు కావస్తోంది హరిలో రంగ హరి అంటూ హరిదాసు కీర్తనలతో వీధి వీధి తిరుగుతున్నాడు. అందరూ లేచి అభ్యంగన స్నానాలు కావించి భోగిమంటలు వేసుకుని అగ్ని దేవుడికి నమస్కారం చేసుకున్నారు. సాయంకాలం భోగి పళ్ళు పేరంటం తో ఇల్లంతా నందనవనం గా, కన్నుల పండుగగా ఉండడం చూసి మనసులోనే మురిసిపోయింది రాజత్త.
పెద్ద పండుగ సంక్రాంతి కనుమ మూడు రోజుల పండుగ ముచ్చటగా గడిచిపోయాయి.. సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దుల మేళం ఆటలు ఇంటి ముందు పాటలతో ఇలా మొదలయ్యాయి..
ప్రభువు గారికి దణ్ణం పెట్టు, పాదం వంచి భక్తిని పెట్టు, పట్టు శాలువలు కప్పేదరంట, కాసులు మువ్వలు కట్టెదరంట, డూ డూ డూ డూ ఎంకన్నా
అంటూ గంగిరెద్దును ఇంటి ముందు నిలబెట్టి ఆడించే ఆటలను చూసి పిల్లలు చాలా సరదాగా గడిపారు.
కనుమ రోజు పిల్లలందరూ కాకినీ నలుపు నువ్వు తీసుకునీ మా తెలుపు మాకు ఇచ్చేయ్ అంటూ తల స్నానాలు చేసి గుడి గోపురాలకు తిరిగి ఊరంతా సందడి చేశారు. అందరి ఇంటి ముంగిలి అందమైన రంగవల్లులతో, గొబ్బెమ్మలతో , వీనులవిందుగా, ఎంతో ఆహ్లాదంగా ,మనసు మురిసి పోయే లా పల్లె సోయగం కన్నుల పండుగగా ఉంది.
కళ్ళముందు పండుగ సందడి కదలాడుతూనే ఉంది. ఇంటికి వచ్చిన పిల్లలు తిరిగి వెళ్లే ప్రయాణం రోజు రానే వచ్చింది. పిల్లలు వస్తున్నారని ఎదురుచూసిన నంత సేపు పట్టలేదు. మనసులో అనుకుంటూ దిగాలుగా కూర్చుoది రాజత్త..
అమ్మా.. చిన్నపిల్లల ఏంటిది? పండుగ ఎంతసేపు వస్తుంది? రోజులు ఇట్టే గడిచిపోతాయి. మళ్లీ సంక్రాంతి పండక్కి నీ కళ్ళ ముందు ఉంటాం కదా. ప్రేమగా అనునయిస్తూ ఎవరు దేశాలకు వాళ్ళు బయలుదేరారు.
అవునవును పండగ ఎంత సేపు? ఇట్టే సంవత్సరం గిర్రున తిరిగి పోతుంది. మళ్లీ పండక్కి ఇక్కడే ఉంటారు గా.. అని మనసుకు సద్ది చెప్పుకొని సంతృప్తి గా తన విధులలో నిమగ్నమై పోయింది రాజత్త.
ఇదండీ రాజత్త సంక్రాంతి సంబరం
కథ కంచికి మనం ఇంటికి

You May Also Like

35 thoughts on “పండుగ వెళాయెరా..!! (సంక్రాంతి కథల పోటీ)

  1. చాలా బాగుంది mam మీ కథ సంక్రాంతి పండుగ వాతావరణం ఏర్పడింది.
    మీ students
    నచికేత్
    వాచస్పతి

  2. బాగా వ్రా సావు, అద్యంతం సొంపుగా సాగింది. Good

  3. రచయిత్రి తన జ్ఞాపకాలకు సంక్రాంతి సంబరాలు జోడించి చాల అద్బుతంగా రాసారు…👏👏👏👏👏

  4. రచయిత్రి తన జ్ఞాపకాలను రంగరించి సంక్రాంతి పండుగకు కలంతో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు… చాల బాగుంది

  5. You are awesome mam, Sankranti is our big festival and u have described about it so clearly and we can feel the festival vibes in your story 👌👏🙏🏻

  6. అద్భుతం…. తెలుగు వాకిళ్ళలో మధ్య మురిసే మందారం లా లా అందం గాఉంది.

  7. రచన చాలాబాగుంది, పల్లెటూరు, సంక్రాంతి పండుగ, కుటుంబం గురుంచి వర్ణన చాలాబాగుంది. 👌👍💐

  8. పండగ విధానాన్ని
    పండగ గొప్పదనాన్ని
    పండగ వాతావరణాన్ని భలే కళ్ళకు కట్టారు
    అప్పుడే పండగ ఐపోయిందా అని కొంచెం భాధ కూడా వేసింది.
    nice😍

  9. చాలా బాగా రాశారు,పండుగ అంతా కళ్ళకు కట్టినట్టు అనిపించింది.చిన్ననాటి సంగతులు అన్ని కళ్ళకు కట్టినట్టు అనిపించింది.

  10. సంక్రాంతి పండుగ గురించి మీరు చేసిన వర్ణన అమోఘం,
    సంక్రాంతి పండుగ కళ్ళ ముందు కదలాడలా చేశారు.
    All The Best.

  11. సంక్రాంతి పండుగ ను కళ్ళ కి కట్టినట్టు వివరించారు పద్మ గారు. చాలా బాగుంది. మళ్ళి పల్లెటూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చి న అనుభూతి Sలిగింది.
    👌👌👌👍🤗

    1. Wow…Sankranti panduga chala baga chupencharu.. kalla mundee kanipesthunattundi chaduvu thunte… proud of you …👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!