సంక్షోభంలో సంక్రాతి (సంక్రాంతి కథల పోటీ)

సంక్షోభంలో సంక్రాతి
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: కార్తీక్ దుబ్బాక

సీతారామయ్య గారిది పట్టణానికి దూరంగా ఉండే సీతమ్మ పేట గ్రామం, ఆయనకి కొడుకు, కూతురు. వాళ్ల ఇద్దరినీ బాగా చదివి, వివాహాలు చేసి ఇతర దేశాలు పంపించాడు. 2012లో వాళ్లు బాగా సంపాదిస్తు కెనడా దేశంలో, కూతురు, అమెరికాలో కొడుకు ఉంటున్నారు, కూతురికి బాబు, పాప, కొడిక్కీ బాబు ఒక్కడే కొడుకు.
కూతురు, వాళ్ల పిల్లలు అందరుతో కలసి, ప్రతి సంవత్సరం సంక్రాతి పండుగకి ఇండియా వచ్చి అమ్మ, నాన్నలతో కలిసి ఒకనెల రోజులు ఉండి వెళ్లే వారు,. సంక్రాంతికి ఊరులో చాలా సంబరాలు జరిగేవి, కోళ్ల పందాలు, ఎద్దులపోటీలు, ముగ్గుల పోటీలు జరిగేవి, ఆఊరిలో చాలా ఆహ్లాదంగా, కోలాహలంగా ఉండేది, ఈ రెండు సం.రాల నుండి సందడి లేని సంక్రాతి సంబరాలు, జరుగుతున్నాయి.
2018 సంవత్సరం వరకు సంక్రాతికి సీతారామయ్య గారిల్లు మనుమళ్లు, మనమరాలితో సంబ్రంగా జరిగేది సంక్రాంతి పండుగ. వారి ఇంటిలో, 2019సం.లో వచ్చిపోయిన మనుమల్లుని చూడాలని సీతారామయ్య దంపతులు ఎదురుచూస్తున్నారు. అనుకోని విధంగా ప్రపంచం మొత్తం కరోనా వైరస్బారిన పడి ఎక్కడి వాళ్లను, అక్కడే ఉంచి, ప్రతి దేశం లాక్ డౌన్ చేసి, దేశ సరి హద్దులు మూసివేశారు, విమానాల ప్రయాణం ఆపారు. కరోనా బారిన పడి ప్రపంచంలో ప్రతి వాళ్లు ప్రాణం అరిచేతిలో పెట్టుకొని జీవిస్తూ, బంధాలు, అనుబంధాలు దూరం అయి గతకాలం స్మృతులు తల్చుకొని జీవిస్తున్నారు. సీతరామయ్య గారికి మాత్రం తమ పిల్లలుని రెండు సం. నుండి చూడాలి అనే కోరికతో,కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఒకసం. పోయింది కదా ఈ సం. అయినా సంక్రాంతి పండుగకి వస్తారు, అని ఎదురు చూసే సీతారామయ్య గారికి మరల చేదు వార్త అందింది… ఒమోక్రాన్ వైరస్, కొత్త వైరస్ మరొకటి వచ్చింది, ఇది కరోనా కన్నా ప్రాణాంతకం అని మరలఫోను, వయసు ఉడిగిన సీతారామయ్యగారి ఆశలు అడియాసలు అయినాయి.
ముసలమ్మా కూడా ఎదురు చూస్తుంది అని చెప్పబోయిన తండ్రికి, కొడుకు సమాధానంతో నోరు పెగల లేదు, సంక్రాంతికి వచ్చి మేము అక్కడ ఉండాలంటే ప్రాణాలు తీసుకోవాలి, అంటూ గట్టిగ చెప్పాడు కొడుకు.. రెండు సంవత్సరాలనుండి రావడానికి అన్నీ అడ్డంక్కులు తెలియదా నీకు అని, తండ్రి పై అరిచాడు. కొడుకు… తరువాత అమ్మకి ఫోను ఇవ్వు అని, అమ్మతో ఇప్పుడున్న పరిస్థితులు ఇండియా రావడానికి అనుకూలంగా లేవు, నాన్నకి నువ్వు చెప్పు అన్నాడు.. ఓకే నాన్న! అనిచెప్పిన తల్లీ, కొడుకుతో ఇక్కడ కూడా ఏమి బాగా లేదు, కరోనా, తరువాత మరేదో దిక్కుమాలిన ఒమోక్రాన్ వచ్చింది, అని అందరు ఇంతకీ ముందుకన్నా జాగ్రత్తగా ఉండాలి అని చెపుతున్నారు కన్నా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది తల్లీ..
భార్య, భర్తను ఓదార్చుతూ అబ్బాయి, వైరస్బారిన పడకుండ ఉండమని కావాల్సిన పద్ధతులు పాటించండి అని, గట్టిగ చెప్పాడు అని చెప్పింది సీతరామయ్యగారితో. ముక్కుకి మాస్కు వేసుకొని ఎప్పుడూ ఉండాలి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాస్క్ పెట్టుకో అని చెప్పాడు, బయటకు ముఖ్యమైన పని ఉంటేనే వెళ్ళమన్నాడు.. అని అయినా ఏమైంది నీకు లోకంలో ఏమి జరుగుతుందో తెలియదా? నీకు, పోయిన సంవత్సరం ఎంత మంది కాలం చేశారో, దూర ప్రయాణంలు అవసరమా ఇప్పుడు. అని భర్తను సముదాయిస్తూ చెప్పింది.
ఈలాంటి సంక్షోభ సమయంలో సంక్రాంతి పండుగకి పిల్లలు రాలేదని బాధ పడటం మానండి. అందరు బాగుండాలి కదా అని చెప్పి, ప్రభుత్వంలు ఎన్ని విధాలా చర్యలు తీసుకుంటున్న ఈ వైరస్ తగ్గడం లేదు, తెలుసు గదా అని చెప్పింది. ఒక ప్రక్కన వరదలు వచ్చి పంటలు పాడైనాయి, పండగలని, పెళ్లిళ్లు అని జరిగే సంబరాలు వలన కూడా వైరస్, పెరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వైరస్ బారిన పడి ఎందరో ప్రాణాలు వదిలారు గదా ఆలోచించండి. sp బాలు గారు పోయినప్పుడు ఎంత బాధపడ్డామో, మరిచిపోయారా పిల్లలు వచ్చి ఇప్పుడు ఉన్న సంక్షోభంలో సంక్రాంతి పండుగ జరపుకోవాలని కోరుకోవడం ఏమిటండి అని చెప్పింది.
అప్పటికి సీతారామయ్య గారికి అర్ధం అయ్యి ఈ సంక్షోభంలో మనం కూడా సంక్రాంతి జరుపు కోవడంచాలా తప్పు, అనిమాట కలిపాడు సీతారామయ్యగారు సంజాయించుకొని,. ముఖ్యంగా జనం గుమ్ము కూడే పండగలకు దూరం ఉందాం అందరం అనిచెప్పాడు. రెండు సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ సంక్షోభంలో ఉందన్నాడు సీతరామయ్య గారు.

// సమాప్తం//

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!