దేవేంద్రునికి ప్రధానమంత్రి మోడీ వేడుకోలు

దేవేంద్రునికి ప్రధానమంత్రి మోడీ వేడుకోలు

ఏమని కదిలావు ఈడ నుంచి
ఏరి అనుమతి ఇచ్చిండ్రు నీకు
చిన్నచూపు చూడలా ఈడ నిన్ను
ఎందు బోతివి సరిగమలు వీడు బాలు

తుంబుర నారదులు నీ కొలువున్న ఉండా
నీకేల మా బాలు వీడుము దేవేంద్ర
మీ తమ్ముడు మోడీ వేడుకోలు విని

సరిగమలుసాగదీసి లయబద్ధం చేసి
రమ్యగుణ దామా ఓబాల సుబ్రహ్మణ్యం
ఆబాలగోపాలం నీ పాటే పరమౌషధం
నీ మాటే సిరివెన్నెల

తుంబుర నారదులు నీ కొలువున్న ఉండా
ఏలా మా బాలు వీడుము దేవేంద్ర
నీ తమ్ముడు మోడీ వేడుకోలు విని

ఏమని బోతివి అందాల ఆమని వీడి
పిలిచుండ మా అన్న దేవేంద్రుడు
నీ మాటల లయలు
నీ పాటల హొయలు తిలకించి ఆలకింప

తుంబురనారదులు నీ కొలువున్నఉండ
నీకేల మా బాలు వీడుము దేవేంద్ర
మీ తమ్ముడు మోడీ వేడుకోలు విని

నీకేలా మనసాయే చిరునవ్వుల చిందు
నగుమోము మాకేల చుపవయే
శృతిలయల ఓ గాన గంధర్వ
ఇది తగునా మమువీడ ఓ బాలు

తుంబుర నారదులు నీ కొలువున్న ఉండా
నీకేల మా బాలు వీడుము దేవేంద్ర
మీ తమ్ముడు మోడీ వేడుకోలు విని

నీకేల మనస యే మమువీ‌డ
సంగీత సాహిత్య యోధుల వీడ
పాడుతా తీయగా మూగబోయే
సంగీత విద్యార్థి లోకం ఏమగు

తుంబుర నారదులు నీ కొలువున్న ఉండా
నీకేల మా బాలు వీడుము దేవేంద్ర
మీ తమ్ముడు మోడీ వేడుకోలు విని

           రచన :: చల్ల సత్యనారాయణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!