తల్లడిల్లిన తల్లి (కవితా సమీక్ష)

తల్లడిల్లిన తల్లి (కవితా సమీక్ష)

సమీక్ష: సుజాత కోకిల

కవితా శీర్షిక: తల్లడిల్లిన తల్లి (వాడిన పుష్పం)
రచన: సుజాత కోకిల

మనిషి జీవిత విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనిషి ఎదుగుతున్న కొద్దీ మనసులోని కోరికలు కళ్లాలా పరిగెడుతున్నాయి. సాంప్రదాయం మంచితనం మర్చిపోయి.చెడువైపు పరుగెడుతున్నారు.చదువులు పక్కన పెట్టి పిక్ టాక్లు ఛాటింగ్ అంటూ పై పై మెరుగుల వైపే మొగ్గు చూపుతున్నారు. అది ఎవరి తప్పు అనేది అర్థం కావడం లేదు. తల్లిదండ్రులక్కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.ఇప్పటి పరిస్థితులు తలకు మించిన భారంగా పెరిగింది. తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు ఇప్పటి పిల్లలకు మాట మంచి తెలియదు. అప్పుడున్న సమిష్టి కుటుంబాలు లేవు అప్పుడున్న ప్రేమానురాగాలు లేవు ఎవరి లోకం వారిదే ఇదిలా ఉంటే సమాజం ఎలా ఉంటుంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాల్యంలో ఆడుకునే ఆట పాటలు లేవు ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు.
ఇంటి నిండా డబ్బులు ఉన్న తిండికి కొదవలేకున్నా ఇంటి నిండా మనుషులున్న ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా టీవీలకు సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు.
కడుపు నిండా మాట్లాడుకోడానికి మనుషులు ఉన్న తినడానికి తిండి ఉన్న కంటినిండా నిద్ర లేకుండా పోతుంది.ఇప్పటి కుటుంబాలకు స్విచ్ వేస్తున్నంత టైమ్ కూడా ఉండటం లేదు. యాంత్రిక జీవనం అయిపోయింది.

******************

తల్లడిల్లిన తల్లి (వాడిన పుష్పం)
రచన: సుజాత కోకిల

గలగల పారే సెలయేరులా
చిందులు తొక్కుతూ
సరిగమ పదనిసలా
రాగాలు పాడుతూ
నీతో నేను పయనం అంటూ
ముందుకు పరుగులు పెడుతుంది
మనిషి నీడలా మనసులోని కోరికలు
ఈ కోరికలకు అదుపు అంతం లేదు
మానవత్వమే లేని ఈ క్రూర మృగాల
జీవితాలకు అంతమే లేదా?
ఎగిరే కెరిటంలా ఎంత దూరం పరుగెత్తాలి
వాయి వరస లేదు చిన్నా పెద్దా తేడా లేదు
వికసించే పుష్పాలు నేలరాలుతున్నాయి
కని పెంచిన తల్లి హృదయము
ఎంత తల్లడిల్లుతుందో తెలుసా
ఆ క్రూర మృగాలకు అర్థమవుతుందా ?
వాళ్ళు కూడా ఒక తల్లి కడుపులోనే పుట్టారు కదా
ప్రసవించే తల్లి పురిటినొప్పులకు భయపడితే
ఈ సృష్టెే ఉంటుందా అమ్మ అనే పిలుపు కొరకు ఎదురు చూస్తుంది.
అది మన అందరికీ అర్థం కావాలి

******************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!