నవ నాగరికత (కవితా సమీక్ష)

నవ నాగరికత (కవితా సమీక్ష)

సమీక్ష: చింతా రాంబాబు

కవితా శీర్షిక: నవ నాగరికత (నాన్న పచ్చి అబద్ధాలకోరు కవితా సంకలనం నుండి)
రచన: సురేంద్ర రొడ్డ

సురేంద్ర రొడ్డ గారిచే రచింపబడిన నవనాగరికత కవిత నాన్న పచ్చి అబద్ధాల కోరు అనే కవితా సంకలనం నుంచి తీసుకోబడింది.

మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు యాంత్రిక యుగంలో చేరిపోయాయని, అలాగే సాంకేతికాభివృద్ధి మనిషి యొక్క ఆలోచనా విధానంతో పాటు అలవాట్లను ,పద్దతులను కూడా మార్చేసి అన్ని రకాలుగా మనిషి యాంత్రిక జీవితం వైపు పరుగులు తీస్తూ.. యంత్రంగా మారిపోతున్నాడని చక్కగా వివరించారు రచయిత.

ఇంటి నిండా మనుషులు ఉన్న వాళ్ళు మనుషులన్నీ టీవీలలో ఉన్న బొమ్మలతోనే మౌనంగా మాట్లాడుతున్నాయి గాని పక్కన ఉన్నవారిని చూసి చిరునవ్వు కూడా నవ్వటం లేదు

పూర్వకాలంలో సన్నికల్లు మీద చేసే పచ్చళ్ళు గుమగుమలాడుతూ రుచి అద్భుతంగా ఉండేవి. పచ్చిడి కమ్మటి వాసన వస్తేనే కడుపు నిండి పోయేది. నేడు గ్రైండర్, మిక్సీ లు వచ్చి పచ్చళ్ళు రుచి తగ్గించాయని, విద్యార్థులు ఉంటే స్కూల్లో, లేకపోతే ట్యూషన్స్ లోనే గాని అమ్మా నాన్నతో , ఆటలు ఆడటంలో కనిపించటం లేదని, అమ్మమ్మ, నానమ్మ ,తాతయ్యలు మాటలు గానీ, నిద్రపుచ్చే ముందు పెద్దలు చెప్పేనీతి కథలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయని, బాల్యం అంతా ర్యాంకులు సాధనకే సరిపోతుందని సరదాలకు సమయం ఎక్కడుందని సమత్కరించారు.

బిజీ జీవితంలో పెళ్లి, ఫంక్షన్స్ లో ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికే సమయం సరిపోవడం లేదు ఇక ఆశీర్వచనాలు ఎక్కడ అందించాలి అని తన భావన వ్యక్తం చేస్తూ ఒకప్పుడు ఒక ఇంట్లో పెళ్లి జరిగితే సహపంక్తి భోజనాలలో ప్రేమ, ఆప్యాయతలు కలిపి కొసరి,కొసరి వడ్డించేవారు. ఇప్పుడు ఆ పద్దతి చాలా వరకు కనుమారుగయ్యి, బఫే భోజనాలు రావటం, అభోజనాల తోపులాటలో వేడి వేడి సాంబారు ఎవరి మీద పడుతుందోనని భయపడుతూనే తృప్తిని నటిస్తూ భోజనాన్ని త్వరగా ముగించేస్తున్నారు .

సెల్ఫోన్ వచ్చి ఉత్తరాన్ని మింగేసింది . అది అందరికీ తెలిసిందే . సెల్ ఫోన్ లో చాటింగ్ లతో నిద్రను, సమయాన్ని కూడా అది మింగేస్తుంది. మనిషిని అన్ని బంధాలకు దూరం చేసి తన గుప్పిట్లోనే పెట్టుకుంటుదని నేటి సెల్ ఫోన్ కు ఎలా బానిసయ్యమో చెప్పారు.

మనిషిలో ఒకప్పుడు ఉండే మమతలు ,ప్రేమానురాగాలు ఇప్పుడు కనుమరుగయ్యి మనిషి మారిపోతున్నాడు మర మనిషా అని రచయిత చక్కగా వివరించారు.

 

You May Also Like

One thought on “నవ నాగరికత (కవితా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!