కుమిలిన హృదయం ఒరిగింది..!

కుమిలిన హృదయం ఒరిగింది..!

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

సంతానాన్ని ఉన్నత శిఖరాన్నెక్కించి
గుండెలపై చేతులేసుకుని
కునుకు తీసిన దేహమది…

తెల్లవారే లేచి బుడతల కడుపునింపి
ఇంటిపనులన్నీ చేసి
చదువులకు సాగనంపిన కరమది…

కన్నీళ్ళకడగండ్లను దాటుతూ
జీవితాన్ని త్యాగం చేసిన
ఓ మాతృమూర్తి మనసది..

అవసాన దశలో చేతికందిన సుపుత్రుడు
తీరిక లేక దరిచేరక మాటాడక
అందనంత దూరాన ఆనందంగా ఉంటే
కడసారి చూపుకు నోచుకోలేక
చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అనుకుంటూ
కుమిలి కుమిలి ఏడ్చుకున్న
ఆ ముసలి హృదయం నేలకొరిగింది…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!