నమ్మకం

నమ్మకం

రచన: చెరుకు శైలజ

వంశీకృష్ణకి బిజినెస్ లో లాస్ వచ్చింది. ఉన్న దంతా బిజినెస్ లో పెట్టుబడి గా పెట్టాడు. బ్యాంక్ లోన్ కూడా  ఇంట్రెస్ట్ డబుల్ అయిపోయింది. ఏమి చేయడానికి పాలుపోవడం లేదు, తల్లిదండ్రులను చూసుకోవాలి..
పెళ్లి చేసుకోనీ రెండు సంవత్సరాలు అయింది, భార్య గీత కూడ వంశీ కృష్ణ కు అన్నింట్లో అండగా ఉంటుంది.
ఇంట్లో రోజులు గడవడమే కష్టమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు.
గీత తోబుట్టువులు,  స్నేహితులు ఎందుకు మీ ఆయన బిజినెస్ చేసేది, ఏదో ఒక ఉద్యోగం చేసుకోక మన బ్రాహ్మణులకు బిజినెస్ చేయడం అచ్చిరాదు అనే వారు
అన్ని మాటలను మౌనంగా భరించేది గీత
ఒకరోజు భర్త తో ఏమండి నేను స్కూల్ లో జాబ్  చేస్తాను అంది, తను చదువుకుంది, ఊరికే ఇంట్లో కూర్చోని ఏం చేస్తుంది . ఆ డబ్బులు ఇంటిలో ఏదో ఒక  ఖర్చుకు పనికి వస్తుందని అని ఆలోచించుకొని అడిగింది.
ఏం నీకు కూడా నా మీద నమ్మకం లేదా నన్ను అందరిలో  చిన్న తనం  చేయాలనే చూస్తున్నావా భర్త అన్నాడు‌
ఛీ అలాంటిది ఏం లేదండి
ఏమిటిరా వంశీ  కోడలిని ఉద్యోగం చెయ్యని ఇంట్లో ఎలాగూ నేను అన్ని పనులు చూసుకోవడానికి  ఉన్నను కదా,, నేను ఎలాగు చదువుకోలేదు చదువుకున్న దానిపైన జాబ్ చెయ్యని తల్లి అంది.
సరే మీ ఇష్టం, ఇద్దరు ముందుగానే కూడబలుక్కుని నన్ను అడిగారు కదా
ఆ మాటలకు అత్త కోడళు ఇద్దరు మొఖాలు చూసుకోమని ముసి ముసి గా నవ్వుకున్నారు.
గీత స్కూల్లోలో టీచర్గా చేరింది, కొడుకును అత్త గారు చూసుకుంటుంది
ఆ వచ్చిన డబ్బు బాబు అవసరానికి  ఉపయోగపడుతున్నాయి.
అలా కాలం జరిగిపోతుంది
డబ్బులు  ఇంట్రెస్ట్స్ తీసుకున్నది బిజినెస్ లో రాక, ఫైనాన్షియల్వాళ్ళు  ఇంటి మీదకు  వచ్చి నానా రభస చేశారు
వంశీ కృష్ణ కి ఉన్న దంతా బిజినెస్కే పెట్టినాడు.
ఇంటి ముందు తిష్ట వేసి కూర్చున్నారు . వంశీ కృష్ణ నాన్న గారు గోవిందరావు  భయపడుతు చూస్తున్నాడు. తల్లి రాధమ్మ మానవుడికి అన్నం పెడుతు ప్రశాంతంగా ఉంది‌.
వంశీ కృష్ణ గీత పనిచేస్తున్న స్కూల్కి వెళ్లాడు. ప్రిన్సిపాలు తనకి  కోసం కబురు పంపింది.
ఇప్పుడు నా కొరకు ఎవరా అని బయటకు వచ్చి చూసిన గీత ఏమండి మీరా ఏమైంది అంది .
ఇంటి ముందు ఫైనాన్షియల్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, నాకు ఏం చెయ్యాలో పాలుపోక నీ దగ్గరకు వచ్చాను. ఒక పదివేలు అన్న కావాలి
అమ్మో పదివేల తను జాబ్ ఏదో చిన్నది ఇప్పుడు అంతా డబ్బు ఎక్కడి నుండి తెచ్చేది, మా ప్రిన్సిపాల్ల్ మేడం కూడా ఇవ్వదు
నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం ఇస్తే  దాన్ని తీసేసి ఈ అప్పు బాధ తీర్చుకుందాం ఏమంటావు
ఒకసారి గీత తన మంగళ సూత్రనికేసి చూసుకుంది రెండు తులాలు ఉంటుంది. అది తప్ప మెడలో ఏమి లేదు
సరే ఒక పసుపు కొమ్ము దారం వెళ్లి కొనుక్కుని రండి అంది
అలాగే అంటు ఒక  పసుపు కొమ్ము దారం తెచ్చి గీతకు ఇచ్చాడు
ఆ పసుపు కొమ్ము కు దారం కట్టి దానిని తన మేడలో వేయిమంది
ఆ దారం గీత మెడలో వేశాడు
తను ఆ మంగళసూత్రం సూత్రం తీసి ఇచ్చింది థాంక్యూ గీత అని చెప్పి  వెళ్లి పోయాడు
తను వెనుదిరిగే సరికి తను కోలిగ్ సరళ నిలబడి ఉంది
ఏమి గీత గారు మీ హస్బెండ్డుకి మంగళసూత్రం ఇచ్చారు.
అలా మగవారు ఏది అడిగితేనే అది ఇవ్వ కూడదు మీరు కష్ట పడుతు ఉద్యోగం చేస్తు ఉంటే వారు బిజినెస్ పేరుతో మిమ్మల్ని మోసం  చేస్తున్నారు.
అప్పుడే లంచ్ బ్రేక్ కాబట్టి అందరు టీచర్స్ వచ్చారు . పద్మ గారు మా వారు అలా చేయారు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఈ బిజినెస్ కోసం ఆయన రాత్రి  పగలనక కష్టపడుతున్నారు. నేను ఆ మాత్రం ఆయనకు చెదోడు వాదోడు గా సహాయం చేయకూడదా.. నేను త్వరలోనే అలాంటి ఎన్నో బంగారు గొలుసులు కొనుక్కో గలను
ఆ మాటలకు  పద్మ మౌనం గా ఉండిపోయింది మిగతావాళ్లు గీతను అలాగే చూస్తూ ఉండిపోయారు.
అలా రోజులు గడుస్తున్నాయి.
బిజినెస్  దిగజారి ఏమి చేయలేని పరిస్థితిలో వంశీ కృష్ణ సౌదీకి వెళ్లడానికో తయారైయాడు‌.గీతకి జీవితం భయం భయంగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో తనను వదిలి వెళ్లి పోతున్న భర్త ధైర్యం చెప్పుతు బాధ పడకు ఒక సంవత్సరం  బాధ భరించు. నేను మంచి జాబ్ చూసుకోని  వస్తాను అన్నాడు.
ఆ మాటలను కండ్లలో నీళ్ళు తిరుగుతుండగా భర్తకి దైర్యం గా ఉంటాననిని మాట ఇచ్చింది.
భర్త వెళ్లి తమ కష్టాలు  తీరుస్తాడని తన జీవితం ఏం కష్టాలు లేకుండా సాగిపోతుంది అన్ని ఆశలసౌదం నిర్మించుకుంది .
ఆ ఆశతోనే కొడుకుని అత్త ,మామలని  చూసుకుంటు సంవత్సరాలు గడిపింది
ఆ రోజు వచ్చింది
వంశీ కృష్ణ  జాబ్ తో అన్ని అప్పులు తీర్చి వేశాడు
గీతకి సౌది నుండి మంగళసూత్రమే కాదు విలువైన ఎన్నో నగలు తెచ్చాడు . గీతకు సంతోషానికి అవధులు లేవు
పసుపు పచ్చని  తళతళ లాడుతు మెడ నిండ వేసుకున్న బంగారి మంగళసూత్రం   పైన చిన్న గొలుసుతో తన స్కూల్ కి వెళ్లింది.
ప్రిన్సిపాల్ కి తన జాబ్ రిజైన్ లెటర్ ఇచ్చింది . టీచర్సు ఉన్న  స్టాప్ రుమ్కి వచ్చింది
పద్మ మిగితా ఫీచర్స్ బేక్లులో కూర్చుని  మాట్లాడుకుంటున్నారు. గీతను చూడగానే
హాయ్ గీత  ఏమిటి సంగతి లేట్ గా వచ్చావు
జాబ్ రిజైన్ చేశాను అంది
అక్కడే వాళ్ళ పక్క కీ కూర్చుంటు
ఏం మీ ఆయనతో సౌది వెళ్లి పోతావా
ఆయనే కొన్ని నెలలు ఉంటారు అన్ని రోజులు లీవ్ కుదరక రిజైన్ చేశాను
టీ తెప్పించి ఇచ్చారు.
పద్మ మాత్రం అలాగే గీత మెడలో మెరుస్తున్న గొలుసులను చూస్తుంది. సౌది బంగారం మెరిసిపోతుంది
మొత్తం నీ మెడ నింపేసినట్టు ఉన్నాడే మీ ఆయన అని ఒక కొలిగ్ అన్నది.
ఆ రోజు నేను మన స్కూల్లో  మంగళసూత్రం ఇస్తుంటే నన్ను భయపెట్టే మాటలు మాట్లాడారు, నేను నా భర్త మీద నమ్మకం తోనే ఆ గొలుసు ఇచ్చాను. ఆ రోజు నా నమ్మకం నన్ను కాపాడింది అంటు అందరి మొఖాలోకీ గర్వం గా  చూస్తూ పద్మ మొఖం లోకి చూసింది . పద్మ చిన్న పోయిన మొఖం తో తల దించుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!