సూర్య ఉదయము

సూర్య ఉదయము

రచన:  నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తూర్పున ఉదయించి లేలేత కిరణాలు బాల్కనీ లోకి ప్రవేశించాయి, బాల్కనీలో రాత్రి జాజి పుల వాసన కోసం మడత మంచం వేసుకుని సూర్య పడుకున్నాడు

పద్మజ తెల్ల వార గట్ల లేచి వంట చేస్తుంది భర్త ఇద్దరు పిల్లలు కూడా హాట్ క్యారేజ్ లు సర్ధి ఇస్తుంది

సూర్య లే కల్పన లే తెల్ల వారి నా బారెడు పొద్దు వచ్చినా నిద్ర లేవాలి కానీ ఇలా పడుకుంటే ఎలా? అంటూ అరిచింది

కూతురు కల్పన కూడా రాత్రి పొద్దు పోయే వరకు రిహార్సల్స్ అయ్యి పడుకున్నది గినిస్ బుక్ లో పేరు కోసం యూనివర్సిటీ నుంచి శివ కల్యాణము లో శివుడు వేషం వేస్తోంది స్నేహితులు పార్వతి దేవి సుబ్రమణ్య స్వామి వేషాలు వేస్తున్నారు 48 గంటల కార్య క్రమము అన్ని గంటల్లో కార్యక్రమం చెయ్యాలి అంటే ఎంతో అలవాటు సాధన ఉండాలి.

అలాగే అమ్మ అంటు కల్పన లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్లేట్స్ లో సర్దింది ఈ రోజు కట్టు పొంగలి చేసింది, నెయ్యి జీడి పప్పులు ఘనంగా వేసి చేసింది. దానిలోకి అల్లం  కొబ్బరి మామిడి పచ్చిమిర్చి   కలిపి చేసింది. పచ్చడి చేసిందిమంచి పోపు పెట్టింది. అల్లం వేసి చేస్తే అజీర్తి ఉండదు తేలికగా జీర్ణం అవుతుంది. గబ గబ పావు గంటలో అంతా ఫ్రష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గర చేరి లొట్టలు వేస్తూ తిన్నారు. ఇంట్లో అందరికీ ఈ తరహా వంటకం ఇష్టము

తొమ్మిది గంటల కల్లా ఇల్లు ఖాళీ. కృష్ణ ఎక్కువ భాగం ఆఫీస్ పనిమీద టూర్ లో ఉంటాడు. పిల్లలను పెట్టుకుని పద్మజ ఉంటుంది. కృష్ణ ఆరోగ్యం అంతంతమాత్రం ఉద్యోగం చెయ్యక తప్పదు.

పద్మజ కి పనిమనిషి వచ్చి కూరలు తెచ్చి ఇల్లు తడి బట్ట పెట్టీ వెడుతుంది సాయంత్రం కూరలు తరిగి ఫ్రిజ్ లో పెడుతుంది.

ఉదయం నిద్ర లేస్తూనే పప్పు కూరలు బియ్యం కుక్కర్లో సర్ధి పెడుతుంది ఈ లోగా పూజ చేస్తుంది పిల్లలు లేచి వచ్చే టప్పటికి ఇడ్లీ గాని దోశ కానీ చేస్తుంది. ఆడపిల్ల సహాయం  చేస్తాను అన్న వద్దు అంటుంది పచ్చడి రాత్రి చేసి ఫ్రిజ్ లో పెడుతుంది. ఆడపిల్ల చేతి కింద ఉంటే ఎంతో ఆసరా. ఫి జి కాగానే పిల్లకి పెళ్లి చెయ్యాలి అని తొందర పడుతోంది ఈ వయస్సులో ఆ ముచ్చట తీర్చాలి అనుకున్నది

ఎవరికీ వారు వెళ్ళిపోయాక బట్టలు ఉతికి అరె స్తుంది.సాయంత్రం పని మనిషి వచ్చి బట్టలు తీసి ఐ రన్ చేసి పెడుతుంది తల్లి తోడుగా పనిమనిషి తమిళ్ చక్కగా పని చేస్తుంది

గిన్నిస్ బుక్ లో పేరు నమోదు కార్య క్రమం అయింది. కార్య క్రమానికి వచ్చిన కల్పన స్నేహితురాలు తల్లి తమ్ముడు
కల్పన శివుడు వేషం లో చాలా అందంగా ఉంది అంటూ ఆమెతో ఫోటోలు తీసుకున్నారు

వారం రోజుల తరువాత కల్పన స్నేహితురాలు రమ్య తల్లి పూర్ణ వచ్చారు, వస్తూ వినాయకుడి ప్రసాదం ఉండ్రాళ్ళు తెచ్చి కొబ్బరి పచ్చడి తెచ్చి ఇచ్చారు. వినాయకుడికి ఇంట్లో గరిక పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదన చేశాను

మాకు కల్పన నచ్చింది మా ఇంటి కోడలిగా చేసుకుంటాము. మా పిల్ల రమ్యకి సంభందాలు చూస్తున్నాము తొందరలో పెళ్లి చేసి పిల్లాడు పెళ్లి చేస్తాము అన్నారు కానీ వాళ్ళు తమిళులు అంటూ భర్త అత్త మామలు అడ్డు చెప్పారు. అంతే కాదు మాకు తెలిసిన సంబంధం ఉన్నది మైసూర్ లో బాగా డబ్బు ఇల్లు అన్ని ఉన్నాయి మీరు ఆసంభంధం చేద్దాము ఎవరో తెలియని వేరే రాష్ట్రం వారికి ఎలా చేస్తారు అన్నరు. భర్త కూడా తల్లి తండ్రుల మాట విన్నాడు

కల్పనను అడిగితే అమ్మ నాన్న మీ ఇష్టం సరే ఉన్న  ఊళ్ళో ఉంటాను నువ్వు అన్నయ్య
వచ్చి పోతు ఉంటారు. మైసూర్ వెళ్లి పోతే ఇంకా రావడం ఇప్పట్లో ఉండదు అక్కడే ఉద్యోగం ,వాళ్ళు అస్తమానం పంపారు ఉద్యోగానికి సెలవు ఉండదు అన్నయ్య రమేష్ పెళ్లి అయ్యేవరకు నేను వచ్చి వెడుతూ ఉంటాను. వదిన వచ్చాక నువ్వు కొంత స్థిమిత పడతావు అన్నది

అదికాదు తాత బామ్మ వప్పుకొరు చాదస్తులు.

సరే మీ ఇష్టం ఎత్తి నాటుగా కట్నం కానుకలు ఇవ్వ వద్దా మా చదువులకి చాలా ఖర్చు ఐయ్యింది

అవును నిజమే మీ తాత కొంత డబ్బు ఇస్తానని చెప్పారు

ఎన్ని రోజులు మారిన ఆడపిల్ల నుదురు రాత మారదు కట్నాలు కానుకలు అన్నీ మామూలే. చదువు నెల జీతం బోనస్ కదా, వంట వార్పు అన్ని చూడాలి

అత్తగారు తోగారు దారం ఆరోగ్యం అంతంత మాత్రం, ఆడవడుచు డాక్టర్ ఇంట్లో ఉండి అన్ని చూస్తుంది ఇక్కడే ఎమ్మెస్ చదువు తోందీ, భర్త సింగ పూర్ లో డాక్టర్ ఏ లోటూ లేదు కొడుకు ఇల్లు వేరే ఉన్నది పెళ్లి తరువాత విడిగా పెడతాము మాతో కోడలు ఉండ నవసరం లేదు అని పెళ్లికి ముందే చెప్పారు వాళ్ళు వాళ్ళ పిల్లను వాళ్ళ దగ్గర సెట్టుకుని ఉన్నారు. అయితే ఆ ఇంటి పెత్తనం అంతా కూతురు దే తల్లి తండ్రి ఏమి మాట్లాడారు, మామ గారు కి నల్గురు అన్న దమ్ములు ఆరుగురు అక్క చెల్లెళ్ళు అంతా ఉన్నారు

పెళ్లి ఘనంగా చెయ్యాలి అన్ని ఘనంగా ఉండాలి అన్నారు అత్తగారికి ఆడబడుచుకి రెండు లక్షలు ఇవ్వాలి పెళ్ళికొడుకు కు బట్టలకి ఐదు లక్షలు ఇవ్వాలి

సరే కట్నం లేదు కానీ లాంఛనాలు పెద్ద హోటల్ లో పెళ్లి రిసెప్షన్ కి ఐదు వందల మంది కొడుకు ఆఫీస్ కూతురు ఫ్రెండ్స్ మామ గారి స్నేహితులు అంతా వస్తారని రూములు బుక్ చెయ్యాలి అని చెప్పారు

ఇంత డబ్బు ఖర్చు పెట్టే పెళ్లి అంటే మాటలా, ఇ రోజుల్లో ఇంకా ఇలా చదస్తం గా పెళ్లి విషయాలు విషయంలో అత్త అడబడుచూ లాంఛనాలు అంటూ వేదిస్తే ఎలా? చదువుకున్న పిల్ల నెల వారి కట్నం  కదా అమ్మ అని కల్పన బాధ పడింది. కానీ పెద్దల కుదిర్చిన సంబంధం చెయ్యాలి అన్నది ఆ ఇంటి పద్ద తి కానీ కృష్ణ మాత్రం తల్లి తండ్రి వైపు మాట్లాడుతాడు.

పల్లెలో ఇల్లు డబ్బు అన్ని ఉన్నాయి ఉద్యోగ రీత్యా మద్రాస్ వచ్చి ఉన్నారు పిల్లలు చదువుకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి కనుక మద్రాస్ లో నే ఉన్నారు కృష్ణ వెళ్లి వచ్చేవాడు, పెత్తనం మాత్రం అత్త మామదే మరియు. మరిది ఆడ బడుచుకు అంతకలిసి ఉంటారు అన్ని వాళ్ళ ఇష్టమే

పద్మజ కూతురు పెళ్లి అత్త మామ ఇష్టమే జరగాలి . అటు పెద్దలు ఇటు పెద్దలు అంతా మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేశారు పిల్లకి పసుపు కుంకుమ కింద రెండు ఎకరాలు రాసి ఇస్తామని తాత అంటే అమ్మి క్యాష్ ఇమ్మ నీ అన్నారు

అబ్బే మేము పిల్లలు పిల్లలు అనంతరం ఇస్తాము అంతే కాదు మీరు వాడుకోవడానికి కాదు అన్నాడు తాత

దానికి ఆడబడుచూ కలుగ చేసుకుని మేము పల్లె వచ్చి పంటలు చూస్తామా?

మాకు క్యాష్ కావాలి మా చదువులకి చాలా ఖర్చు అయ్యింది తమ్ముడు కూడా చాలా ఖర్చు ఆ య్యిందీ వాడు కోసం మూడు కోట్లు పెట్టీ ఇల్లు కొన్నాము అన్నది అంతే కాదు ఈ పెళ్లి జరిగిన మా క్యాష్ ఇచ్చేవరకు పిల్లను మా గడప తొక్క నివ్వను అని చెప్పింది

డాక్టర్ చదివిన ఆమెకి కించిత్ మాన వత్వం లేదు కల్పన పెళ్లి చేసుకోవడానికి భయ పడింది

అమ్మ అన్నంత పని చేసేలా ఉన్నది అన్నది

పద్మజ పెళ్లి వారిని వెళ్లి అడిగి వస్తె చిన్న పిల్ల దానికి తెలియదు పొలం విలువ మంచి పని మీరు పిల్లకి పొలం ఇస్తున్నారు అని వారి పెద్దలు అంతా తృప్తి పడ్డారు బర్జర్ పిజ్జాలు తిని పుష్టిగా ఉంటారు అక్క తమ్ముడు తల్లి వంట చెయ్యదు తండ్రి అన్ని కోని తెచ్చి పెట్టు కోని పిల్లలను పెంచి చదివించాడు అంతా వా డే తిప్పలు పడ్డాడు అని అన్నారు పెళ్లి ఘనంగా చేశారు ఆడ వడుచు స్నాతక ము నకు రాలేదు అంటే గోరింటాకు పెట్టు కొన్నది అన్నారు

పెళ్ళిలో కూడా అమె కనిపించక పోయేసరికి అందరికీ అను మా నం వచ్చింది

మొత్తానికి పెళ్లి అయ్యింది
విమానం లో పెళ్లి వారు పిల్లను తీసుకెళ్లారు, మర్నాడు కార్లో వ్రతానికి అందరూ కలిస్ శ్రీ సత్యనారాయణ వ్రతము శ్రీ వేంకటేశ్వర దీపారాధన కు అందరినీ పిలిచి బాగానే చేశారు అప్పుడు కూడా అధబడుచు ముభావంగానే ఉన్నది

పిల్లాడు తెల్లగా మిల్క్ బోయ్ లా ఉన్నాడు పెళ్లికి వచ్చిన వారు వీరి గొడవ చూసి పిల్ల ఏమి సుఖ పడుతుంది ఇలా పెళ్లి చేశారు పిల్లకి చదువు ఉన్నది ఉద్యోగం రెండేళ్లు చేస్తే కొంత అవగాహన వస్తుంది అన్నారు

సరే విధి రాత ఇలా ఉన్నది అన్నారు

పదహారు రోజుల పండుగ కి మళ్లీ అంతా వచ్చారు చిన్న సైజ్ పెళ్లి లా చెయ్యాలని చేశారు

కానీ కల్పనకి భయంగానే ఉన్నది సురేష్ అక్క మాటలే విన్నాడు కల్పనతో డబ్బు తెచ్చి బ్యాంక్ లోన్ తీర్చక కొత్త ఇంటికి వె డ దాము అంతా వరకు నువ్వు పుట్టింట్లో ఉండు అని అక్క తమ్ముడు చెప్పారు

అత్త మామ అతిథులు మాదిరి ఉన్నారు అంతా  వారు పిల్ల ఇష్ట ప్రకారం ఉంటారు

కల్పన బాధ పడింది మళ్లీ రమ్య కాల్ చేసి ఎలా ఉన్నావు అనే టప్పటికి చాలా బాధ పడి అన్ని విషయాలు చెప్పింది

నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి కల్పన పిలువ కుండానే వచ్చింది

అంటి మీరు పెద్దల మాటకు విలువ ఇచ్చారు వాళ్ళు డబ్బు మనుష్యులు డాక్టర్ చదివిన సంస్కారం లేదు కొన్నాళ్ళు జాబ్ చెయ్యి నివ్వండి అని ఊరుకో పెట్టింది కల్పన కేమి గిన్నిస్ బుక్ లో పేరు నమోదు అయ్యింది అందగత్తె మీరు మేము తమిళుల మని ఆలోచించి పెళ్లి చేశారు ఇప్పుడు ఒక్క రోజు కూడా సుఖ పడలేదు

సూత్రం కట్టి వదిలారు డబ్బు ఇస్తేనే భార్య గా చూస్తారు లేక పోతే మీ ఇంట్లో ఉంచేస్తమని చెప్పారు అని కల్పన బాధ పడింది . నాకు చాలా బెంగ భధ గా ఉంది అభం శుభమ్ తెలియని పిల్ల పెద్దల పట్టు దలకి జీవితం సమస్యల్లో ఉండి పోయింది

వాళ్ళు ఇంక తీసుకెళ్లారు వెళ్ళిన ఆడబడుచ్ సుఖ పడనివ్వదు అన్నది

అంతా ఎంతో బాధ పడ్డారు పాతిక లక్షలు ఖర్చు విడియోలు మిగిలాయి బిల్లులు అన్ని తీర్చి స్థిమిత ప డాలి అనుకుంటే మళ్లీ మొదటికి వచ్చింది అని పద్మజ రమ్య తల్లి దగ్గర బాధ పడింది.

మీరు ఏమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. మీరు పిల్లకి మళ్లీ పెళ్లి చెయ్యండి . ఇలా అన్నానని ఏమి అనుకో కండి అన్ అన్నది

మంచి మాట కానీ. ఎవరూ చేసుకుంటారు అన్నది

మా రమ్య పెళ్లి ఈ ఏడు చేస్తున్నాము అధి కావాలని చేసుకుంటోంది

కల్పన కూడా పెళ్లి చేసుకుని సుఖ పడాలని దాని ఉదేశ్యం అందుకే అక్క తమ్ముడు కలిసి
ఆలోచించి కల్పనను తనకి మరదలుగా తెచ్చు కోవలని చెప్పింది.దానికి పద్మజ ఎంతో సంతోషించింది కృష్ణ కి చెపితే ముందే మనం ఆలోచించాలి కానీ పెద్దలకి గౌరవం ఇచ్చాము. ఆస్తులు అంతస్తులు డబ్బు అపార్ట్మెంట్ లు మనుష్యులు జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాయి

రమ్య తమ్ముడు సురేష్ కూడా అక్క మాట విని పెళ్లికి వ ప్పుకున్నాడు

అక్కడ అక్క వల్ల పెళ్లి అయిన జీవితం ఆగిపోతే ఇక్కడ అక్క వల్ల కొత్త జీవితం మొదలు అయ్యింది పిడి కిట తలంబ్రాల పెళ్ళికూతురు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన మధ్య అనందంగా సురేష్ కల్పన ఒకటి అయ్యారు రమ్య పద్మజ ఎంతో సంతో ష పడ్డారు. కల్పన రమ్య వదిన మరదలు గా ఎంతో బాగా అనంద పడ్డారు

ఇంక పద్మజ కృష్ణ కొడుకు పెళ్లి విషయం కొడుక్కి వదిలేశారు అతని కన్నడం పిల్లను తెచ్చి కాదు కాదు  అమె కోరి వచ్చి కోడలు అయ్యింది

విధి రాత ఎలా ఉంటే అల పెళ్ళిళ్ళు జరుగుతాయి అస్తి అంతస్తు కాదు పెళ్లి కి కావలసిన ది ప్రేమగా చూసే భర్త అత్త వారు ఇంటికి వచ్చిన పిల్లను డబ్బును చూసి కాక వ్యక్తిత్వం బట్టి చూడాలి .

పెళ్లికి ముందు గొప్ప ప్రేమ కబుర్లు చెప్పడం కాదు పెళ్లి తరువాత ప్రేమగా భార్య కు ఇచ్చే ప్రేమ అనందం పంచాలి అప్పుడే సూర్య ఉదయం ప్రతి జీవితంలో ఉంటుంది

సూర్య పెళ్లి కూడా తమ చుట్టాలు అమ్మాయి ఉంది అని అత్త మామ చెపితే ఇంకా వినేది ఎవరూ?.కల్పన జీవిత ఇలా మారింది కనుక అదృష్టం అందుకే సూర్య తన కొలీగ్ కన్నడం అమ్మాయి రాగిణి నీ పెళ్లి చేసుకుని సుఖ పడ్డాడు

జీవితం చిన్నది అందులో పెళ్లి పేరుతో ఒకటయిన భార్య భర్తల మీద అత్త అడవడుచు పెద్దల పెత్తనం కాక వాళ్ళని ఒకరి కొకరు అర్థం చేసుకుని సుఖం గా జీవించాలని పెద్దలు దీవించండి అప్పుడే నిజమైన సూర్య ఉదయానికి ఆనందము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!