నిజమైన ప్రేమ

(అంశం :: ” ప్రేమ”)

 నిజమైన ప్రేమ💕💕

రచయిత :: స్రవంతి

బయట జోరుగా వర్షం పడుతుంది.క్లాసులో గురువుగారు పాఠం బోధిస్తున్నారు. కిటికి లోనుండి చల్లటి గాలి అందరిని అలరిస్తుంది. నా చూపు మాత్రం గది ద్వారం వద్ద ఆగింది.ఎవరో నాకోసమే వచ్చారు అనే బావన కలిగింది నాలో..
” సార్ లోపలికి రవొచ్చ”..అనే మాటలకు అందరూ తననే చూస్తున్నారు
(వాలు జడ, కలువ లాంటి కళ్ళు). నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ నా పేరు కుసుమ అని చెప్పింది.
మేము అప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజులు.

ఆ వయ్సులో అది ప్రేమ, ఆకర్షణ తెలీదు కానీ తనతో మాట్లాడాలని,చూడాలని ఉండేది.

మా మధ్య మంచి స్నేహం బలపడింది. మేము అయిదుగురు స్నేహితులము.అందులో ముగ్గురు అమ్మాయిలు, ఇద్ధరు అబ్బాయిలు. మా టెన్త్ పరీక్షలు అయిపోయాయి వేసవి సెలవులు వచ్చాయి.. అందరం దూరం అవుతున్నాము అనే బాధ కంటే తనకు దూరంగా వెళ్తున్నపుడు నాకే తెలియకుండా కన్నీటి పర్యంతమయ్యాను. .. అప్పటికి నాకు తెలీదు తన మీద ఉన్నది స్నేహం లేదా ప్రేమ ,ఆకర్షణ…

నాన్న బిజినెస్ రీత్యా మేము సిటీకి వెళ్ళవలసి వచ్చింది.అక్కడే కాలేజీలో జాయిన్ అయ్యాను.ఎవరిని చూసినా తన రూపమే కనిపించేది. సిటీ నుండి వచ్చి
మా స్నేహితుల ద్వారా తను చేరిన కాలేజీలో నేను జాయిన్ అయ్యాను..
మళ్ళీ మా స్నేహం బలపడింది. అలా అలా..రోజులు గడిచాయి నా మనసులోని మాటను తన ముందు వ్యక్తపరిచాను

“నిన్ను చూసిన క్షణాన నాలో తెలియని భావం కలిగెను నాడు.
నేడు తెలిసేనే ఆ భావం కు అర్థం ప్రేమని”
అందుకు “నీ ప్రేమకై పరితపిస్తున్న ప్రియతమ” అని చెప్పింది. అలా తను నా ప్రేమను అంగీకరించడంతో ఇంకా నా జీవితం ఆనందమయంగా సాగింది.

ఇద్దరం కలిసి ఒకే కాలేజిలో జాయిన్ అయి మా స్టడీస్ పూర్తిచేసాము..తనతో గడిపిన ఆ మధుర క్షణాలను ఎన్నటి మరువలేను.
ఎవరికైనా కాలేజీలో గడిపిన రోజులు తీపి జ్ఞాపకాలు అందులో నాకు తనతో గడిపిన రోజులు నా జీవిత మధుర స్మృతులుగా నిలిచాయి…
అనుకోని సంఘటన ఎదురైంది తనకు పెళ్ళీ సంబంధాలు చూస్తున్నారు కుసుమ అమ్మ నాన్న. ఇంకా ఆలస్యం చేయకుండా మా ప్రేమ విషయం ముందుగా మా అమ్మ నాన్నకు చెప్పాను. వాళ్ళు సరే అని కుసుమ అమ్మ నాన్న తో మాకు ఒక్కడే కొడుకు మా బిజినెస్, ఆస్తి అంతా వాడికే మి కుసుమను మా ఇంటిమహాలక్ష్మి లాగా చూసుకుంటాము అని చెప్పారు
అందుకు ససేమిరా అంటూ మా ప్రేమను అంగీకరించలేదు వారు.

జీవితం అంటే ఇదే” మనసుకు నచ్చింది ఏది జీవితంలొ ఉండదు” .
ఎందుకు తరాలు మారిన,శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన కులమతాల అడ్డు గోడలు మాత్రం కులిపోవు. ఈ ఆచారాలు ,కులాలు మనిషి సృష్టే కదా ప్రేమ కూడా మనిషి సృష్టి మరి ఎందుకు అర్థం చేసుకోరు ఈ మనుషులు..

తన తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లి చేసుకుంది కుసుమ.తనతో గడిపిన క్షణాలను పదిలంగా దాచుకొని నా జీవిత ప్రయాణం సాగించాను.కుసుమ జ్ఞాపకాలు వదిలి కొత్త జీవితం ప్రారంబించమని మా అమ్మ నాన్న ఎంత చెప్పినా నా మనసు వారి మాట వినడం లేదు. ఇక్కడ ఉంటే తల్లిదండ్రి బాధపడతారు అని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. వెన్నెల్లో కూడా జీవితం అంత శూన్యం అనిపించింది..

అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. నా స్నేహితుడి పెళ్లి లో అనుకోకుండా కుసుమని చూశాను తన చేతిలో చిన్న పాప తో కనిపించింది. నన్ను చూసిన వెంటనే తను నా నుండి దూరంగా వెళ్ళిపోయింది . మా స్నేహితులు తన గురించి అన్ని విషయాలు చెప్పారు తన భర్తకు పెళ్లి కంటే ముందు ఆరోగ్యం బాగా లేదని తను చనిపోతాడని తెలిసి పెళ్లి చేసుకున్నాడని చెప్పారు.

ఆ మాటలకు నా మనసు హృదయవిదారకంగా మారింది. ఇప్పుడు ఏవి… కులమతాలు తను కోల్పోయిన జీవితాన్ని అందిస్తాయా? తన జీవితాన్ని తిరిగి ఇస్తాయ? అంటూ నాలో నేనే మదన పడ్డాను.
ఇంకా “ఆలస్యం చేయను తన చేయి ఎన్నటికీ వీడను”… కుసుమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మీరు అన్నట్లు పెళ్ళికి కులాలు మతాలు కలవాలి కానీ పెళ్లికి ఇవి మాత్రమే కాదు కావాల్సింది ప్రేమ, నమ్మకం. రెండు మనసుల మధ్య నమ్మకం ఆ నమ్మకం రెండు జీవితాలను ఏకం చేస్తుంది. ఆ నమ్మకాన్ని నేను తనకు అందిస్తాను. అనటంతో

కుసుమ తల్లిదండ్రులు నా ప్రేమను అర్థం చేసుకోనీ మా వివాహం చేశారు. ఇప్పూడు మేము ముగ్గురం ఆనందంగా మా జీవన ప్రయాణంను సాగిస్తున్నాము.

నిజమైన ప్రేమ మరణం వరకు ఉంటుంది..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!