ఇష్టమే విజయ శ్రీకారం

అంశం: ఇష్టమైన కష్టం

ఇష్టమే విజయ శ్రీకారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ఇష్టమైనది కాదు కష్టం
కష్టం అనుకుంటే నష్టం
నష్టాన్ని తప్పించుకోవాలంటే పడు ఇష్టం
ఇష్టం తో పారద్రోలు అయిష్టం

విజయానికి తొలిమెట్టు ఇష్టం
ఇష్టమే కలిగిస్తుంది లక్ష్యం
లక్ష్యం ఇస్తుంది స్ఫూర్తి
స్ఫూర్తియే లక్ష్య సాధన

లక్ష్యసాధనయే విజయ శ్రీకారం
ఉన్నతిని సాధించి పెట్టేది
అభ్యున్నతి కి తీసుకు వెళ్ళేది
మహోన్నుతునిగా చేసేది కేవలం ఇష్టం

అందుకే చేసే పనియైన
సాధించే లక్ష్యమైన
చేధించే సమస్యయైనా
ముందు ఇష్టపడాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!