మానవ నైజం

అంశం: ఇష్టమైన కష్టం

మానవ నైజం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పద్మావతి పి

అమ్మ ఒడిలో బాల్యం వేసిన కేరింతల కావ్యం
ముత్యాల రాశులై కురిపించిన నవ్వుల వెన్నెల జల్లుల లేలేత ప్రాయం
జోల పాటల ఊయలలో మురిపాల
నిదురించిన శైశవ గారాబం..
అమ్మానాన్నల సాంగత్యంలో, గురువులు నేర్పిన శ్రద్ధా భక్తులతో కూడిన అక్షర అభ్యాసం
బంగరు భవితకు బాటలు వేసిన ప్రధమాధ్యాయం..
అల్లిబిల్లి ఆలోచనల జలతారులై మెరిపించిన  యవ్వనం,
ఆమని వసంతాలై అరుదెంచిన ప్రేమ పరాగం,
జంటగా జీవితమే ఒక పంటగా పండుగల వలపుల దీపాలు వెలిగించిన దాంపత్య జీవితం
పిల్లాపాపలతో గృహ సీమను స్వర్గంలా మలచుకునే సాధనా ప్రయత్నం
కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని బాధ్యతా కర్తవ్యాలను పాలించే ప్రౌఢం..
ఆశల కలలే పండాయని, కోర్కెల ఆకాంక్షలు తీరాయని,
కృషికే ఫలితం దక్కిందని, అలసీ-సొలసీ ఒదిగీ-ఒరిగీ విశ్రాంతి తీసుకునే వృద్ధాప్యం..
రెక్కలు తొడిగిన పిట్టలు ఎగిరి పోతూ ఉంటే,
చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ
జీవితమే ఒక రంగస్థల మంటూ
ఒంటరిగా నిలిచిన జీవితం..
భవబంధాలను విముక్తికై
కష్టమైనా ఇష్టమైందీ జీవితమంటూ
జీవించడమే మానవ నైజం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!