పల్లెపాట

పల్లెపాట

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :యాంబాకం

సంక్రాంతి వచ్చిందోయి
వేకుజాము లేవాలోయి

తలంటి స్నానాలు చేయాలోయి
కొత్త బట్టలు వచ్చేనండోయి

సంక్రాంతి వచ్చిందోయి
పిండి వంటలు చేసేనోయి

బంధు మిత్రులు కలసేనోయి
చిన్న పెద్ద కలసి మెలసి ఉండేనోయి

సంక్రాంతి వచ్చిందోయి
గంగిరెద్దుల ఆటల పాటలోయి

గాలిపటాలు ఎగరేసినారోయి
తీయ్యని పాయసాలు తాగిరోయి

సంక్రాంతి వచ్చిందోయి
చిన్నవారిని పెద్దలు దీవించితిరోయి
గుడి గోపురం చూదము రండోయి
కోడిపందాలు బహు బాగున్నాయి రోయి

సంక్రాంతి వచ్చిందోయి
ధాన్యం వచ్చే నోయి
మా ఆశలు తీరగ పొంగళ్ళు పొంగెనోయి
అలంకరించిన మరదళ్ళు బావను చూడవచ్చనోయి
హరిదాసు పాటల సంబరాలు చేసేనోయి

సంక్రాంతి వచ్చిందోయి
కొత్త సంవత్సరం తెచ్చిందోయి
రంగు రంగుల ముగ్గులుగీసెనోయి

ఆడపిల్లలు గొబ్బెమ్మ లను ఉంచెనోయి
కొత్త అల్లుడు అత్త ఇంటికి వచ్చా రండోయి
బావలకి మరదళ్ళ నలుగు పెట్టేనోయి
సంక్రాంతి వచ్చిందోయి

సంక్రాంతి బలే ఆనందం తెచ్చె నండోయి
తొలిపంటలుఇంటికి వచ్చేనండోయి

సంక్రాంతి వచ్చిందోయి
సంక్రాంతి వ‌చ్చిందోయి

You May Also Like

One thought on “పల్లెపాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!