నాలో నీకై

నాలో నీకై

రచన: AK

ఆలోచనల మధ్యలో
అల్లారుతున్నా నీ ధ్యాసలో
అల్లరి పిల్లలా నీ ప్రేమలో
అల్లరి చేస్తూన్నా
ఆనందంగా గెంతుతూ
నీ ప్రేమలో నా గెలుపును
చూసుకుంటూ మురిసిపోతున్నా
ముసి ముసిగా నా మనసులో
నీ ముద్దు మాటలు
మేదులుతుంటే నీ మన్మథ సామ్రాజ్యంలో
నా సొగసు తరిగిపోవాలని
దేహం తపిస్తూ నా దేహంలో సెగలు
రేపుతున్నాయ్….
రగులుతున్న నీ ప్రేమలో
దీపం లా వెలిగిపోతూ
వేగులలో నిన్ను చూసుకుంటూ
కాలం గడిచే కొద్ది
నేనే నువ్వులా మారిపోతున్నా
నాలో ఏ సందేహం అక్కర్లేదని
నీ ప్రేమ లో ఇది మామూలే
అంటూ నా మనసు నాకు
సర్ది చెప్తుంటే చింత మాని
చిరునవ్వుతో సాగిపోతూ
నీ ప్రేమ మైకంలో
నాలో నీకై అన్వేషిస్తున్నా….

You May Also Like

5 thoughts on “నాలో నీకై

  1. సందర్భోచిత పద ప్రయోగం అద్భుతం అక్షర గారు

  2. చాలా బాగు౦ది… 😘
    మీ కవితలు తరచుగా చదువుతూ ఉ౦టాను….
    చాలా బాగుంటాయి అ౦డీ…..
    చాలా అ౦టే చాలా బాగుంటాయి….. 😍
    మీరు ఇలాగే మ౦చి కవితలు తరచుగా రాసి, మమ్మును ఆన౦ది౦పజేయాలని కోరుకుంటున్న…
    మీరు కూడా మీరు అనుకున్నది తొందరలో సాధించాలి అని కోరుకుంటున్నము…..
    మీ శ్రేయస్సుకోరే …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!