ఏజెంట్ అవినాష్

ఏజెంట్ అవినాష్

రచన: విస్సాప్రగడ పద్మావతి

కోడికూసే సమయానికే పాల వాడు పాల ప్యాకెట్ పెట్టి వెళ్ళాడు. పేపర్ వాడు పేపర్ వేసి వెళ్ళాడు. ఇవేమీ పట్టకుండా భూతద్దం చేతబట్టి గది అంతా వెతక సాగాడు అవినాష్. నిశ్శబ్దం ఆవరించింది, అవినాష్ వెతకడం మాత్రం ఆపలేదు.

అవినాష్ ఒక ప్రైవేటు డిటెక్టివ్. చిన్న చిన్న కేసులు తప్ప పెద్ద కేసు లేవి పలకరించలేదు అతన్ని. ఇష్టపడి కష్టపడి డిటెక్టివ్ అయినా, విజయాలు మాత్రం వరించలేదు. పక్కింటి వాడి పాల ప్యాకెట్ ఎవరో దొంగిలించారనో , ఆకుకూరలు అమ్ముకునేవాడు తన ఆకుకూరల బుట్ట మాయమైందనో.. ఇలాంటి చిన్న చిన్న కేసులు తప్ప తను ఊహించుకున్నట్టు తన స్థాయికి తగ్గ పెద్ద కేసులు వచ్చేవి కావు. అయినా పట్టుదలతో ప్రయత్నం పరమావధి అనుకొని వృత్తినే దైవంగా భావించి, జీవనం సాగిస్తున్నాడు ఏజెంట్ అవినాష్.

సార్ సార్ అంటూ రొప్పుతూ వచ్చింది అనసూయ. ఏమైంది సార్ ఎందుకు అలా వెతుకుతున్నారు? దేని కోసం ఏదైనా హత్య జరిగిందా? హత్య కేసు వచ్చిందా! సర్.. ఏమైంది? ఏం జరిగింది? చెప్పండి సార్! లేకుంటే ఎందుకు వెతుతున్నారో అర్థం కాక టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అంటూ అడిగింది అనసూయ.

ఉష్హ్… గట్టిగా మాట్లాడకు.. రాత్రి పడుకోబోయేముందు నా లుంగీ మీద పెద్ద బొద్దింక వచ్చింది. అది ఎటు పోయిందా అని దాని గురించి వెతుకుతున్నాను. అనేసరికి అనసూయ ఓ నిట్టూర్పు నిట్టూర్చింది. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ రింగ్ వినపడే సరికి ఇద్దరూ హాల్లోకి వచ్చారు. అవతల్నుంచి ముగ్ధేశ్వరం తో ఎస్. ఐ అర్జెంటుగా స్టేషన్ కి రమ్మని ఫోను.

గబగబా స్టేషన్ కి వెళ్ళి ఎస్.ఐ ని కలిసి ఏంటి విషయం అడిగితే ఎస్. ఐ ఈ విధంగా చెప్పాడు.
“లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల పనులు లేక జీతాలు రాక ఎంతో మంది అనేకరకాల ఇబ్బందులు పడుతూ దొంగలుగా, దోపిడీలు గా మారారు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే రామారావు పేట లోని మూడో ఇంట్లో సేటు ఊరు నుండి వచ్చిన రోజున హత్యకు గురవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ హత్యకు కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. హత్య చేసినది ఎవరో కనిపెట్టాలి.”

ఎస్సై ఈ విధంగా చెప్తుంటే అవినాష్ ఆనందానికి హద్దులు లేవు. సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. తప్పకుండా సార్ చేస్తాను. అని ఈ కేసులో ఎలాగైనా సరే చేదించాలి అనుకుంటూ బయట కొస్తాడు.
వెంటనే అనసూయతో హత్య జరిగిన స్పాట్ కి వెళ్తాడు. చుట్టూ ప్రదేశాన్ని కలియ చూసి.. ప్రతిదీ అనుమానం గా పరిశీలనతో చూస్తారు.
గుండెల నిండా భయం నింపుకున్న డ్రైవర్ .. వెక్కి వెక్కి ఏడుస్తూ కనబడతాడు. వెంటనే అవినాష్ అతని దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడిస్తున్నావని అడుగుతాడు.
దానికి డ్రైవర్ ఇలా చెప్తాడు. ‘ఈయన మా సేటు! నేను ఈయన కార్ డ్రైవర్ ని. గత పది సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా కార్ డ్రైవర్ గా ఈ సేట్ వద్ద పనిచేస్తున్నాను. ఇప్పుడే పని లోకి వచ్చిన నేను విగతజీవిగా పడి ఉన్న ఈ సెట్ను చూసి తట్టుకోలేక పోయాను. విలవిలలాడి పోయాను. కన్నతండ్రి వలె నన్ను సాకారు. అలాంటి వ్యక్తి నాకు లేకపోవడం తట్టుకోలేకపోతున్నాను.’ అంటూ బోరుమని విలపించ సాగాడు.
డ్రైవర్ అతివినయం చూసి అవినాష్ కు డ్రైవర్ పై అనుమానం వచ్చింది. డ్రైవర్ ని పరిశీలన గా చూశాడు. ఏజెంట్ తీవ్రమైన చూపును చూసి కంగారు పడ్డాడు డ్రైవర్. అతని జేబులో ఉన్న మూటకు సంబంధించిన తాడు బయటకు వెలాడుతుంది.

అవినాష్ వెంటనే డ్రైవర్ జేబులో ఉన్న మూటను బయటకు లాగాడు. వాటిలో డైమండ్స్ ఉంటాయి. చూసి ఆశ్చర్యపోతాడు. అవి నీ జేబులోకి ఎందుకు వచ్చాయి?? అని గట్టిగా ప్రశ్నించాడు. డ్రైవర్ భయపడి అసలు విషయం ఈ విధంగా చెప్తాడు.
“ఉదయాన్నే ఈయన దుబాయ్ నుండి ఇండియాకు వచ్చాడు. వస్తూనే కారులో తన ఫ్రెండ్ తో ఈ వజ్రాల గురించి మాట్లాడారు. వెంటనే ఆ సేటు తన ఫ్రెండ్ వజ్రాలను కాజేయాలని అనుకుని సేటు పై దాడి చేయబోయాడు. మా సేటు ను కాపాడే ప్రయత్నంలో నేను అతనిపై తిరగబడే సరికి భయంతో మధ్యలోనే కావాలని దిగిపోయాడు అతను. ఇంటికి రాగానే సేటు వజ్రాలని బీరువాలో దాస్తుంటే, ఆ వజ్రాలు నా చేతిలో ఉంటే జీవితం సెటిల్ అయిపోతుందని ఎలాగైనా ఈ సేట్ ను చంపి ఆ వజ్రాలు తీసుకోవాలనీ.. పక్కనే ఉన్న కత్తితో సేటు ను పొడిచి చంపి ఆ వజ్రాల మూట తీసుకున్నాను.”అని జరిగింది చెప్పాడు.
ఎస్సై గారు ఇది జరిగింది అని అవినాష్ డ్రైవర్ చేత అసలు నిజాన్ని చెప్పించి జైలుకు పంపిస్తాడు కేసు చాలా సులువుగా సాల్వ్ అయినందుకు సంతోషంగా శనక్కాయలు తింటూ ఇంటికి చేరుకుంటారు అవినాష్ అనసూయ.

You May Also Like

One thought on “ఏజెంట్ అవినాష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!