రేపటి ఉషోదయం కోసం..!
రచన;: శ్రీలత. కే ( హృదయ స్పందన )
నీ కళ్ళలో నా ప్రతిబింబాన్ని చూడాలనుకున్నాను,
నువ్వు నా కన్నీటికి కారణమయ్యావు…
నీ మనసులో నాజ్ఞాపకాలను దాచుకుంటావనుకున్నాను
నాలో జ్ఞాపకాలే లేకుండా చేస్తున్నావు..
నీ గుండె చప్పుడులో నా పేరే వినాలనుకున్నాను,
నా గుండె చప్పుడు ఆగిపోయేలా చేస్తున్నావు..
నీ ప్రేమలో నన్ను నేను మరచిపోవాలి అనుకున్నాను,
ప్రేమ అనే పదానికి అర్ధం లేకుండా చేస్తున్నావు..
భాదను మరిపించి నాలో సంతోషం నింపుతావనుకున్నాను,
భాద తప్ప సంతోషం అంటే ఏమిటో తెలియకుండా చేస్తున్నావు..
నాకు జీవితాంతం తోడు ఉంటావనుకున్నాను,
ఈ క్షణమే నీ నుండి దూరంగా వెళ్లిపోయేలా చేస్తున్నావు..
ఇవాలిటి అస్తమయంలో నిరాశని ఒదిలి,
కొత్త ఆశలతో రేపటి ఉషోదయం కోసం ఎదురుచూస్తున్నాను….. !
***