కుందేలు తెలివి

కుందేలు తెలివి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

ఒక అడవిలో ఒక కుందేలు నక్క స్నేహంగా ఉండేవి. నక్క కుందేలు తో స్నేహం గా ఉంటునే లోపల కుందేలును ఎలాగైనా అంతం చేయాలని ఆలోచిస్తు ఉండేది. కుందేలు ఆహారం కూరగాయాలు  క్యారెట్స్ పక్కనే కూరగాయలతోట ఉండడం వలన  కుందేలుకు చాలా సులభంగా ఆహారం దొరికేది. దానితో నక్కకు లోలోపల కుందేలు మీద కోపం పెంచుకుంది ఎప్పుడు అదను దొరకపోతుందా దాని పని పట్టకపోతానా అని ఆలోచిస్తూ రోజులు గడుపుతుంది. ఒకరోజు కుందెలు తీరిగ్గా ఆహారం తిని కూర్చుంది. నక్క అటువైపు వస్తు ఏం కుందేలు బావా  తీరికగా ఉన్నావు అని అడిగింది. నాకు ఎప్పుడూ తీరికే హాయిగా శాఖాహారం కూరగాయలు తీనడం, పడుకోవడం అవి ఎప్పుడు నాకు సులభంగా  దొరుకుతాయి కదా! అంది. నీకైతే మాంసాహారం రోజు ఎక్కడికో వెళ్లి కష్ట పడాలి .అలా కష్ట పెడితేనే తినే ఆహారం లో మజా ఉంటుంది. మాంసాహారం రుచి నీకేం తెలుసు  ఒకసారి రుచి చూశావు అంటే ఇంకా వదిలి పెట్టవు అంది. నన్ను ఉరించకు నీవే హాయిగా శాఖాహారిగా మారిపో ఎంచక్కా ఇద్దరు కలిసి ఇక్కడే దొరికింది తిని హాయి గా ఉందాం అని కుందేలు అంది. అబ్బో నేనా ఇంత సులభంగా వచ్చింది తింటే నాకు ఏం తోచదు. నువ్వె నాతో రా అలా వెళ్లి వద్దాం. మాంసాహారం రుచి చూడు నీకు నచ్చలేదు. అనుకో వదిలేయి  నిన్ను అడుగను నాకు తోడుగా రా ! నాతో పాటు కాస్త రుచి చూద్దువు. ఒకదాన్ని ఏం కూర్చుటావు. హాయిగా కబుర్లు చెప్పుకుంటు వెల్దాం అంది. నక్క స్నేహంగా మాట్లాడేసరికి కదనలేకపోయింది. సరే పద బావ అంటు బయలుదేరింది. తన పథకం పారినందుకు నక్క లోలోపలే సంతోషిస్తు పైకి కనబడకుండ ఏవేవో కబుర్లు చెప్పుతు బయలుదేరారు. అలా నడుస్తూ చాలా దూరం వెళ్ళారు .ఒక కాలువ అడ్డం వచ్చింది. ఇది దాటగానే కుందేలు పని పట్టాలి అనుకుంది. ఎందుకంటే నక్కకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఆ కాలువ దాటాక ఆయితే  కుందేలు తప్పించుకునే వీలు ఉండదు అని  నక్కమనసులో అనుకుంది. ఇద్దరు కాలువ దగ్గరకు వచ్చారు. అంతా దూరం వచ్చారు. పైగా అక్కడ ఏం జంతువులు కనిపించడం లేదు. ఎందుకో కుందేలుకు నక్క పై అనుమానం వచ్చింది. ఏదో ఒకటి చేసి నక్క దగ్గరి నుండి తప్పించుకోవాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. కుందేలు బావా కాలువ ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఉన్నావా ? ఏం భయపడకు నా వీపు మీద కూర్చో నిన్ను అవుతలి ఒడ్డుకు తీసుకుపోతా అంది. అయ్యో నా మతి మండ మరిచే పోయాను .ఎంతో పని చేశాను. నీతో మాటలో పడి అంది. ఏమైంది కుందేలు బావా నక్క అంది. నా నేస్తం కూడా చాలా రోజుల నుండి ఈ కాలువ దాటి వెళ్లి ఏదైన మంచి మాంసాహారం భుజించుదాం అని అడుగుతునే ఉంది. నేనే దాటివేసుకుంటు వస్తున్నాను. ఇప్పుడు తనను కూడా తీసుకు వస్తె బాగుండేది. కొంచెం సేపు నీవు ఇక్కడే ఉంటావా? పరుగున వెళ్లి తనను తీసుకొని వస్తాను అంది. నక్కకి ఆకలి ఎక్కువగా ఉన్న అబ్బా ఒక కుందేలు అనుకుంటే ఇంకోటి కూడా నాకు రెండు మూడు రోజులవరకు ఆహారం కోసం కష్టం ఉండదు. అని మనసులో సంతోషపడుతు సరే కుందేలు బావా వెళ్లు దారి గుర్తు వుందిగా.   తొందరగా వచ్చెయ్ అంది. అలాగే నక్క బావా ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను. అంటు గబగబా పరుగు లాంటి నడకతో  కుందేలు ఉపాయంతో నక్క నుండి తన ప్రాణాలు రక్షించుకుంది. తెలివైన కుందేలు. అందుకే, మూర్ఖుల మాటలు ఎప్పటికీ నమ్మ రాదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!