మూగజీవి మాతృ హృదయం

మూగజీవి మాతృ హృదయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: తిరుపతి కృష్ణవేణి

వీరాపురం అనే గ్రామంలో వీరన్న అనే ఓ  పేదవాడు. వుండే వాడు. అతనికి  భార్య  ఒక కొడుకు వున్నారు. అతని ప్రధాన వృత్తి వేటాడటం. మరియు ఆ ఊరికి దగ్గరలోఉన్న దట్టమైన అడవికి ప్రతి రోజు వెళ్ళి ఆ రోజుకు అడవిలో దొరికిన వస్తువులను సేకరించి సంతల్లో అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తూఉండేవాడు. తాత తండ్రుల నుండి అడవినే నమ్ముకొని జీవిస్తున్నారు. ఆ అడవే వారికి జీవనాధారం. చిన్న చిన్న జంతువులను, పక్షులను వేటాడటం, మరియు ప్రకృతి సహజంగా ఆ యా కాలాల్లో దొరికే పండ్లు, అడవి కాకరకాయలు, తేనే, దుంపలు, పుట్ట గొడుగులు, ఆకులు, కట్టెలు ఇలా అడవిలో దొరికే ప్రతి వస్తువు ను సేకరించుట, వాటిని అమ్మి సొమ్ము చేసుకొనుటకు వారికి దిన చర్యగా ఉండేది.
అడవి ద్వారా లభించే వస్తువులే తమ జీవనానికి  లాభ సాటి అని వీరన్నకూడా అదే వృత్తిని ఎంచుకున్నాడు. వారికి స్వార్థం లేదు. పూట గడిస్తే చాలు. చాలాతృప్తి గా జీవించేవారు. ప్రతి రోజు వీరన్న తన పెంపుడు కుక్క టామీని తీసుకొని అడవికి వెళ్తుండేవాడు. వీరన్నకు చిన్న, చిన్న పక్షులని, ఉడుములను, కుందేళ్లను వేటాడటం అంటే చాలా ఇష్టం. వేట మాంసం తెచ్చినప్పుడు,
ఇక  వీరన్న భార్య రంగమ్మ కు ఆ రోజు పండగే!పండగ! కానీ వాళ్ళ కొడుకు రాముకు మాత్రం అడవి జీవుల మాంసం తినటం అస్సలు నచ్చేది  కాదు. రాముకు జంతువులన్న, పక్షులన్నా! చాలా ప్రేమ, వాటిని హింసించకూడదు, చంపకూడదు?అవి మూగజీవులు, వాటికి హాని చేయకూడదు! అని చెప్తుండేవాడు. అయిదేళ్ల రాము చిన్నతనం   నుండే నోరులేని పక్షులు, జంతువులపై మక్కువ   పెంచుకున్నాడు. రాముకి వారి పెంపుడు కుక్క టామీ అంటే చాలా ఇష్టం దాన్ని విడిచి ఒక క్షణం ఉండేవాడుకాదు! టామీని చాలా ప్రేమతో చూచేవాడు. దానితో ఎంతో స్నేహంగా వుండేవాడు. ఇద్దరూ! ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒక రోజు వీరన్న వుదయాన్నే లేచి తన కుక్క టామీని తీసుకొని అడవికి వెళ్ళాడు. ఈ రోజు ఎలాగైనా కుందేలునో, ఉడుమునో వేటాడి ఇంటికి తీసుకొని వెళ్లాల్సిందే! అనుకొని పొదల మాటున కూర్చొని తన వేట ప్రారంభించాడు. చిన్నప్పటి    నుండీ తనను ఎంతో ప్రేమగా పెంచిన తన     యజమానికి సహాయ పడటం, ఆయన ముఖంలో సంతోషం చూడటం అంటే టామీకీ చాలా ఇష్టం. తాను ఏదయినా జంతువును వేటాడి తెచ్చినపుడు యజమాని సంతోషం తన సంతోషంగా టామీ భావించేది. ఈ రోజు కూడా యజమాని ముఖంలో ఆనందం చూడాలని, యజమానితో కలసి తాను కూడా మాటువేసిఎదురు చూస్తుంది. ఎటువైపు   నుండి చప్పుడు వినపడినా ఏ జంతువు   వస్తుందో! అని తన డేగ కళ్ళతో పరిశీలించ సాగింది. ఎంతసేపైనా! ఒక్క పిట్ట అయినా!   దొరకక పోయే సరికి వీరన్నకు నీరసం ఆవహించింది. ఈ రోజు నా సమయం అంతా వృధా అయిపాయే! ఇక ఇంటికి వెళదాము,     అనుకొని వీరన్న ట్టెల మోపు కట్టుకొనుటలో నిమగ్నమై పోయాడు. ఇంతలో ఒక జింక గడ్డి మేస్తూ ఇటువైపుగా వస్తూ కనిపించింది!  దాని దృష్టి అంతా  తినే గడ్డి పైనే ఉంది గబగబా మేస్తూ కడుపునింపుకొనే పనిలోనే నిమగ్నమై ఉంది.
బోయవాడు వీరన్న కు ప్రాణం లేచి వచ్చింది.
రోజూ చిన్న , చిన్న జీవులతో వాటితో   సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఈ రోజు  జింకను  చూసిన తర్వాత  చాలా ఆనందంవేసింది. ఇక   ఈ నా పంట పండినట్టే! అని మనసులోనే అనుకుంటూ, బాణాన్ని గురిచూచి బలంగా జింక పై సంధించాడు. ఏమర పాటుగా గడ్డి మేస్తున్న
జింక మెడ భాగంలో బాణం లోతుగా గుచ్చుకుంది.
ఆదెబ్బకు త్రుళ్లి పడి జింక వేగంగా పరిగెత్తటం మొదలు పెట్టింది. వేటగాడు వీరన్న, అతనితో పాటు కుక్క కూడా వేగంగా జింక వెనుకనే పరిగెత్త సాగింది.
వీరన్న కొంత దూరం పరిగెత్తి, బాగా అలసటకు గురై ఆగి పోయాడు. నోటి దగ్గరకు వచ్చిన ఆహారం   తప్పిపోయి నందుకు ఒకింత బాధపడ్డాడు వీరన్న.
టామీ మాత్రం జింకను తరుముకుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్ళింది. టామీ తిరిగి వస్తుందేమోనని వీరన్న చాలా సేపు వేచి చూసాడు.
కానీ దాని జాడ కనిపించలేదు. ఎంత సేపటికి రాకపోయే సరికి, అదే వస్తుందిలే? ఆలస్యంగానైనా ఇంటికి తిరిగి రావటం దానికి అలవాటే! అదే వస్తుందిలే! అనుకుని ఇంటికి వెనుదిరిగాడు  వీరన్న. సాయంత్రమైన, టామీ మాత్రం తిరిగి  రాలేదు. అడవిలో ఎక్కడో దారి తప్పి వుంటుంది.   అదే వస్తుందిలే ! అనుకున్నారు. వీరన్న కొడుకు రాము రాత్రి అంతా, నిద్రపోకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు. తెల్లవారింది, టామీ మాత్రం  తిరిగి రాలేదు. అలా ఒకటి, రెండు, మూడు   రోజులు గడిచాయి. టామీ జాడ మాత్రం లేదు?.    టామీ కోసం బెంగతో రాము తిండి తినటం   కూడా మాని వేసాడు. ఎక్కడికి వెళ్ళావు    టామీ ? ఏమి అయిపోయావు? అస్సలు  ఉన్నావా? లేదా? బ్రతికి ఉంటే వచ్చేదానివే?  ఏ జంతువులన్నా ! నిన్ను చంపేశాయా ? నీవు   లేనిదే! నేను ఉండలేను. నన్ను వదిలేసి  అలా ఎందుకు వెళ్ళావు? నేను నీకు గుర్తుకు రావటం లేదా టామీ! అని మౌనంగా రోదించ సాగాడు  రాము. ప్రతి రోజు వీరన్న అడవిలో ఒక దిక్కుకు వెళ్ళి అడవినంతా గాలించి వస్తున్నాడు. అయినా టామీ జాడ తెలియటం లేదు. ఇరువై, రోజులు గడిచి పోయాయి. అడవిలో ఏం జరిగి ఉంటుందో? వీరన్న దంపతులకు అర్ధం కావటం లేదు.
వీరన్న కుటుంబం! టామీ గురించి రోజూ ఆలోచిస్తూ, భారమైన హృదయాలతో కాలం వెళ్ళదీస్తున్నారు. రాముకు నిద్రలో కూడా టామీ జ్ఞాపకాలే! అడవిలో టామీ కూడా తన యజమాని తన గురించి ఏమనుకుంటున్నాడో? తన స్నేహితుడు రాము ఏం బాధ పడుతున్నాడో అని ఆలోచించ సాగింది. అసలు ఆ రోజు కీకారణ్యంలోఆ రోజు జరిగిన సంఘటన టామీ కళ్ళల్లో మెదిలింది.
అడవిలో గంటల తరపడి జింకను తరుముతూ, తను పరిగెడుతునే ఉన్నది. పరిగెడుతున్న జింక ఆకస్మాత్తుగా  ఒక దగ్గర ఆగిపోయింది. జింక బాగా ఆయాస పడుతూవుంది. తను కూడా నిలిచి పోయి జింకను చూస్తూ ఉంది. అప్పుడు అక్కడ జరిగిన దృశ్యం చూసిన నేను నిర్చేస్ట్రురాలునై చూస్తుండి పోయాను. జింక మెడ పై నుండి ధారాపాతంగా రక్తం ప్రవహిస్తూంది. జింక కన్నుల వెంట కన్నీళ్లు కారుతున్నాయి. నోటివెంట బరువుగా గాలి తీసుకుంటూ, అంతే వేగంగా గాలిని బయటకు వదులుతూంది. ఒక రకంగా మరణ వేదన పడుతూవుందా! అనిపిస్తూంది. జింక ప్రసవవేదన పడుతున్నదని నాకు నెమ్మదిగా అర్ధం కాసాగింది.
అయ్యో! సూడి తో ఉన్న జింకనా! నేను ఇంతసేపు తరిమింది. పురిటి నొప్పుల బాధ తనుకూడ అనుభవించింది. ఆ బాధ తనకు తెలుసు. జింక బాధను నిశ్శబ్దంగా గమనిస్తూ, చూడ సాగాను.
ఇంతలో బుల్లి జింకపిల్ల తల్లి గర్భంనుండి నెలమీదకు జారి పడింది. చాలా అందంగా ఉంది
తల్లి జింక ఆయాసంగా నెలమీదకు ఒరిగి పిల్లను ప్రేమతో నాకుతూ, నెమ్మదిగా ప్రక్కకు ఒరిగి ప్రాణాలు విడిచింది. నా కళ్ళల్లో నీరు తిరిగాయి.
ఆ దృశ్యం నా హృదయాన్ని ద్రవింపజేసింది
ఏం చేయాలో! తనకు అర్ధం కావటం లేదు.?
తనలో ఉన్న మాతృ హృదయం ఒక్కసారిగా మేల్కొంది. ఇంటికి తిరిగి వెల్దామనుకున్ననేను,
తల్లిని కోల్పోయిన పిల్లను వదలి వెళ్ళటానికి మనసు అంగీకరించలేదు. ఒక ప్రాణం పోయింది.
ఈ పసి కూన ప్రాణాన్నయినా కాపాడుదామని  నిర్ణయించుకుని ఏ జంతువులు తినకుండా చూడాలని, పసికూన కాస్త లేచి తిరిగే దాకా తోడుగా ఉండాలని నిర్చయించుకొని కాపలాగా ఉండసాగాను. రోజులు గడుస్తున్నాయి.
నా యజమాని ఏమనుకుంటున్నాడో! నా ప్రియమిత్రుడు రాము నేను ఏమైపోయానో? అని బాధపడుతుంటాడు. ఇక ఇంటికి వెళ్లాలని  నిర్ణయించుకున్నాను. కాని పసికూన బుల్లి జింక తననే తల్లి అనుకుంటూ! ఎటు వెళ్లినా తనవెంటే వస్తూంది. రోజూ తనదగ్గరే పడుకుంటూంది. దాన్ని విడిచి వెళ్లాలనిపించలేదు! నా మిత్రుడు రాముకు జంతువులు అంటే చాలా ఇష్టం ఈ చిన్ని జింకను బహుమతిగా తీసుకుని వెళితే చాలా సంతోషిస్తాడు అని, ఆలోచించి ఒక రాత్రి సమయాన ఇంటికి బయలు దేరాను. కూన జింక కూడా నాతో జతగా బయలు దేరింది. చిన్నగా ఆ పసిజింక పిల్లను నడిపించుకుంటూ, తెల్లవారే సరికి ఇంటికి చేరుకున్నాను. తను ఇంటికి చేరుకున్న సంగతి తన యజమానికి తెలియాలని పెద్దగా మొరుగుతూ  నేను వచ్చిన విషయాన్ని సంతోషంగా  మొరుగుతూ తెలియజేసాను. నా అరుపు విన్న నా యజమాని దంపతులు మిత్రుడు రాము, నిద్ర లేచి బయటకు పరుగెత్తు కొని వచ్చారు. ఆప్యాంగా తోకనాడిస్తూ అందరిని రాసుకుంటూ, ప్రేమగా తిరిగాను.
నన్ను చూసిన వారి సంతోషానికి అవధులు లేవు.
పైగా చిన్న జింక పిల్లను వెంటేసుకుని తీసుకవచ్చాను గదా! అది చూసిన రాము చాలా సంతోషంతో నన్ను గట్టిగా తన గుండెకు హత్తుకున్నాడు. నాకు బహుమతిగా తెచ్చివా?అనగానే తోకాడిస్తూ, రాము చేతిని నాకుతూ కుయ్యు, కుయ్యు మని అరుస్తూ, అవును అన్నట్లు రామూ చుట్టూ తిరిగాను. రాము జింకపిల్లను చూసి ఎత్తుకొని మురుసిపోయాడు. అది రాము ఒడిలో మౌనంగా ఒదిగి పోయింది. టామీ! ఇన్ని రోజులు అడవిలో ఏం జేసిందబ్బా? అనివీరన్న ఆలోచనలో పడ్డాడు. చివరికి ఒక ఆలోచనకు వచ్చాడు. తమ టామీ చాలా తెలివైనది. అంత దూరం వెళ్ళింది! వేటాడిన జింకనే తెస్తుంది. అనుకున్నాను. అట్లా కాక, చిన్న పసికూనను తెచ్చింది అంటే? నేను వేటాడింది సూడితో ఉన్న జింకనుఅనుకుంటా! అది ప్రసవించి చనిపోయి ఉంటుంది. టామీ ఒక తల్లిగా ఆలోచించి మరణించిన జింకను ఒదిలి, దాని బిడ్డ  ప్రాణాన్ని రక్షించి తన మాతృహృదయాన్ని చాటుకుంది.
సూడి తో ఉన్న ఒక జీవిని వేటాడి ఘోరమైన తప్పు చేసాను. ఆ జింక ఎంత మరణవేదన అనుభవించిందో? తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది, అని వీరన్న చాలా బాధపడ్డాడు.
నోరులేని టామీ కష్టంలో ఉన్నఒక పసికూన ప్రాణాన్నికాపాడి, తన తల్లి ప్రేమను గొప్పగా చాటుకుంది. మూగ జీవి అయినా టామీది ఎంతగొప్ప హృదయం? ఇకముందు ఎప్పుడూ, మూగజీవులను, పక్షులను వేటాడకూడదు? అని వీరన్న శపథం చేసాడు. తండ్రి తీసుకున్న నిర్ణయం పట్ల రాము ఎంతో సంతోషించాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!